Army Agniveer: ఆర్మీ అగ్నివీర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ రిలీజ్.. పరీక్ష నమూనా, సిలబస్ ఏమిటంటే..
దేశ రక్షణ కోసం కట్టని గోడలా నిలబడే సైనికుల నియామకాన్ని భారత సాయుధ దళాలు చేపట్టాయి. ఈ మేరకు అగ్నివీర్ అనే ఒక కొత్త రిక్రూట్‌మెంట్ విధానం తీసుకొచ్చింది. ఈ మేరకు చేపట్టిన ఆర్మీ అగ్నివీర్ GD రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం హాల్ టికెట్ విడుదల చేయబడింది. పరీక్ష జూన్ 30 నుంచి ప్రారంభమై జూలై 10 వరకు కొనసాగుతుంది. పరీక్ష సిలబస్, నమూనా ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుల నియామకానికి సంబంధించిన రాతపూర్వక అడ్మిట్ కార్డును భారత సైన్యం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించి రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైన వాటిని నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర పోస్టులకు అడ్మిట్ కార్డు రేపు ( జూన్ 18న) విడుదల చేయబడుతుంది. అగ్నివీర్ నియామకానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో ఏ రకమైన ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా విధానం, సిలబస్ ఏమిటి, పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది. తదితర వివరాలను గురించి తెలుసుకుందాం..
భారత సైన్యం గతంలో జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలో 50 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) అడుగుతారు. ఎంపికైన అగ్నివీరులు నాలుగు సంవత్సరాలు భారత సైన్యంలో పనిచేస్తారు. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత.. 25% అగ్నివీరులను సంస్థాగత అవసరాల ఆధారంగా భారత సైన్యంలో రెగ్యులర్ కార్డర్లుగా చేర్చుతారు.
ఆర్మీ అగ్నివీర్ పరీక్ష 2025: పరీక్షలో ఎన్ని మార్కులు ఉంటాయి?
పరీక్ష CBT మోడ్‌లో నిర్వహించబడుతుంది. మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తగ్గించబడతాయి. అభ్యర్థులు షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం 30 నిమిషాల ముందు వారి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటరు ID కార్డ్ వంటి ఫోటోతో కూడిన అధికారిక గుర్తింపు కార్డుతో కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ భారతి 2025 పరీక్ష: పరీక్ష సిలబస్ ఏమిటి?
అగ్నివీర్ జీడీ, ట్రేడ్స్‌మన్ పోస్టులకు జరిగే రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 15, జనరల్ సైన్స్ నుంచి 15 , రీజనింగ్ నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ , రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 15, ఫిజిక్స్ నుంచి 15 , కెమిస్ట్రీ సబ్జెక్టు నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. సిలబస్ గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు భారత సైన్యం జారీ చేసిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రకటనను చూడాల్సి ఉంటుంది.
మరిన్ని కెరీర్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








