AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: మీ కలలో మీరు విచారంగా ఉన్నట్లు కనిపిస్తున్నారా.. జాగ్రత్త సుమా.. మీకు ఎటువంటి హెచ్చరిక తెలియజేస్తుందంటే..

స్వప్న శాస్త్రం ప్రకారం కలలలో కనిపించిన పక్షులు, జంతువులూ, వస్తువులు సంఘటలు వివిధ భావాలను వ్యక్తం చేసే ప్రతీకలు. అయితే కలలో ఎవరికైనా తనకి తాను అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తే .. ఈ కల ద్వారా మనకు అనేక ముఖ్యమైన సూచనలను ఇస్తుందని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. ఇటువంటి కల మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యం, సామాజిక జీవితంలోని వివిధ అంశాల గురించి హెచ్చరిక లేదా మార్గదర్శకత్వం కావచ్చు

Swapna Shastra: మీ కలలో మీరు విచారంగా ఉన్నట్లు కనిపిస్తున్నారా.. జాగ్రత్త సుమా.. మీకు ఎటువంటి హెచ్చరిక తెలియజేస్తుందంటే..
Swapna Shastram
Surya Kala
|

Updated on: Jun 17, 2025 | 11:35 AM

Share

మన జీవితాల్లో కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేదాలలో కలలను మనస్సు, ఆత్మ , విశ్వం నుంచి వచ్చే సందేశాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా మనం కలలలో సంతోషంగా, విచారంగా లేదా బాధగా ఉన్నట్లు కనిపిస్తే ఇటువంటి కలలు ఈ సంకేతం మానసిక స్థితిని మాత్రమే కాదు ఆధ్యాత్మిక, కర్మ కోణాలను కూడా ప్రతిబింబిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం అటువంటి కలలను విశ్లేషించడం, వాటి వెనుక ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడం అవసరమని భావిస్తారు.

ఆధ్యాత్మిక అశాంతికి సంకేతం. కలలలో తనకు తాను సంతోషంగా లేనట్లు కనిపిస్తే.. అటువంటి కల ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక అశాంతి లేదా అసంతృప్తి ఉందని సూచిస్తుంది. ఇది మనస్సు, ఆత్మ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కావచ్చు. ఇలాంటి కలలు మనసుకు శాంతి స్థిరత్వం అవసరమని సూచిస్తున్నాయి. సాధన, ధ్యానం, ప్రార్థన ద్వారా ఈ అశాంతిని తొలగించవచ్చు.

చర్యలు, హెచ్చరికల ఫలితాలు హిందూ మత గ్రంథాల ప్రకారం కలలలో విచారంగా ఉన్న ఆత్మ లేదా తనకు తాను బాధగా ఉన్నట్లు కనిపిస్తే తరచుగా గత జన్మలో చేసిన కర్మల లేదా ప్రస్తుత కర్మల ఫలితాలను సూచిస్తుంది. ప్రస్తుత కర్మలను సరిదిద్దుకోకపోతే జీవితంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని కూడా ఇది హెచ్చరిక కావచ్చు. కనుక ఒకరి ప్రవర్తనపై శ్రద్ధ వహించడం, సత్కర్మలను పెంచుకోవడం అవసరం.

ఇవి కూడా చదవండి

కుటుంబం, సంబంధాలలో ఉద్రిక్తతకు చిహ్నం. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో విచారంగా ఉన్నట్లు కనిపిస్తే.. అది అతని కుటుంబంలో లేదా సామాజిక సంబంధాలలో ఉద్రిక్తత లేదా సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా కావచ్చు. అలాంటి సమయాల్లో కుటుంబంతో కమ్యూనికేషన్, పరస్పర చర్యను పెంచుకోవడం అవసరం.

ఆరోగ్య హెచ్చరిక కలలలో మీరు విచారంగా లేదా బాధగా ఉన్నట్లు కనిపిస్తే కూడా శరీరక లేదా మానసిక ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. ఇది నిరాశ, ఒత్తిడి లేదా శారీరక బలహీనతకు సంకేతం కావచ్చు. కనుక అలాంటి కలల తర్వాత ఒకరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.

ఆధ్యాత్మిక వృద్ధికి మార్గదర్శకత్వం విచారకరమైన కలలను చూడటం ప్రతికూలమైన ప్రభావాన్ని మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన జీవితంలోని తప్పులను అర్థం చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఇటువంటి కలలు మాధ్యమం కూడా కావచ్చు. స్వప్న శాస్త్రంలో ఇటువంటి కలలను ఒక హెచ్చరికగా తీసుకోమని తెలియజేస్తుంది. ఇది ఆధ్యాత్మిక అవగాహన, అభివృద్ధి వైపు ప్రేరేపిస్తుంది. అలాంటి కలలను చూసిన తర్వాత సాధన, ధ్యానం, మంత్రాలు జపించడం వల్ల ప్రయోజనం పొందుతారు.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలలో మిమ్మల్ని మీరు విచారంగా ఉన్నట్లు చూసుకుంటే అటువంటి కల మీకు చాలా ముఖ్యమైన సూచనలను ఇస్తుంది. ఇది మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యం, సామాజిక జీవితంలోని వివిధ అంశాల గురించి హెచ్చరిక లేదా మార్గదర్శకత్వం కావచ్చు. కనుక ఇలాంటి కలలను విస్మరించకండి. అటువంటి కలలను జీవిత మెరుగుదల, ఆధ్యాత్మిక పురోగతికి అవకాశంగా భావించి తదగుణంగా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.