Bhishma Niti: ఆనందం కోసం అధికారం కాదు.. సమాజ శ్రేయస్సు కోసమే అంటున్న భీష్మ నీతి.. విజయం కోసం ఏమి చేయాలంటే..
చరిత్రలో అతిపెద్ద యుద్ధం మహాభారతం. మహాభారతంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు సహా చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు భీష్మ పితామహుడు. మహాభారత యుద్ధానికి ముందు, తరువాత భీష్మ పితామహుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను చెప్పాడు. మహాభారత యుద్ధంలో గొప్ప యోధులలో భీష్మ పితామహుడు ఒకరు. దీనితో పాటు అతను గొప్ప తత్వవేత్త కూడా అతను చెప్పిన విషయాలను భీష్మ నీతి అంటారు.

చరిత్రలో అతిపెద్ద యుద్ధం మహాభారతం. మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తుల్లో భీష్మ పితామహుడు ఒకరు. కురు వృద్ధులైన భీష్మ పితామహుడు మనిషి జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన విషయాలను అనేకం చెప్పాడు. భీష్మ పితామహుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త కూడా. అతను చెప్పిన విషయాలను భీష్మ నీతిగా పరిగణిస్తారు. నేటికీ ఈ విషయాలు ఒక వ్యక్తికి మార్గదర్శకంగా పనిచేస్తాయి. హస్తినాపురాన్ని రక్షించడానికి భీష్మ పితామహుడు తన జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చా మృత్యువు వరం పొందాడు. భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ.. అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు జీవించే మార్గాన్ని బోధించాడు. అతని విధానాలు నేటికీ అనుసరణీయం. ఈ విధానాలను పాటించిన వ్యక్తి తన జీవితంలో విజయం సాధించవచ్చు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అనుసరించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
- త్యాగ భావన. ఒక వ్యక్తి ఏదైనా పొందాలనే దురాశతో ఉండటమే కాదు అతనిలో త్యాగ భావన కూడా ఉండాలి. త్యాగం లేకుండా విజయం లేదు. త్యాగం లేకుండా వ్యక్తి ఎలాంటి భయం నుంచి విముక్తి పొందలేడు. జీవితంలో అనేక విషయాలను త్యాగం చేయడం ద్వారా మాత్రమే అంతర్గత ఆనందం లభిస్తుంది.
- నిర్లక్ష్యం చేయవద్దు. భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం వ్యక్తి అందరితో ప్రేమగా మాట్లాడాలి. మధురమైన మాటలు ఎవరి హృదయాన్నైనా గెలుచుకోగలవు. ఎవరి హృదయాన్ని అయినా గాయపరిచే పదాలను ఉపయోగించవద్దు. అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు. ఎవరినీ విమర్శించవద్దు.
- స్త్రీల పట్ల గౌరవం రామాయణం, మహాభారతం వంటి సంఘటనల వెనుక ప్రధాన కారణం స్త్రీలను అవమానించడం. స్త్రీని అవమానించినప్పుడల్లా విపత్తు సంభవించింది. కనుక ఏ స్త్రీని ఎప్పుడూ అవమానించవద్దు. ఎల్లప్పుడూ స్త్రీని గౌరవించండి. స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపం.
- ఆనందాన్ని సాధించడం మూర్ఖులు లేదా అత్యున్నత జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే జీవితంలో ఆనందాన్ని పొందగలరని భీష్మ పితామహుడు చెబుతున్నాడు. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండరు.
- సామాజిక సంక్షేమం భీష్మ పితామహుడు చెప్పిన ప్రకారం కేవలం ఆనందాన్ని అనుభవించడానికి అధికారాన్ని ఉపయోగించవద్దు. అధికారం పొందిన తర్వాత.. సమాజ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేయాలి. అలా చేయాలా వద్దా అనేది అధికారంలో ఉన్నవారి చేతుల్లోనే ఉంటుంది. కనుక అధికారంలో ఉన్నవారు సమాజ శ్రేయస్సు గురించి తెలుసుకోవాలి.
- లక్ష్యాలు పెట్టుకోండి. భీష్మ పితామహుడు .. ఒక వ్యక్తి విజయం సాధించాలనుకుంటే.. అతను మొదట తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇతరుల చేతుల్లో కీలుబొమ్మగా మారకుండా తమ సొంత ఉనికిని సృష్టించుకోవాలి. దీని కోసం తన సొంతం మార్గాన్ని , లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకునే వ్యక్తి అంతిమ ఆనందాన్ని పొందుతాడు.
- మార్పును అంగీకరించండి మార్పు అనేది ఈ ప్రపంచంలో మార్పులేని నియమం. ఏ కాలం లేదా వ్యక్తి శాశ్వతంగా ఉండడు. ప్రతిదీ మారుతుంది. ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ప్రవేశిస్తుంది. కనుక భీష్మ పితామహుడు ప్రతి మనిషి మార్పును అంగీకరించాలని చెబుతున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








