AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సౌదీలో తెలంగాణవాసి మృతి… నెల రోజుల తరువాత వెలుగులోకి నిజం..!

ఎన్నో ఆశలతో తన కుటుంబ పోషణ కోసం.. బ్రతుకు దెరువు కోసం.. దేశం కానీ దేశానికి వెళ్ళాడు.. అక్కడ పనులు చేసుకుని తన కుటుంబాన్ని చూసుకోవాలి అనుకున్నాడు. కానీ విధి వారి కుటుంబంలో ఓ తీరని విషాదాన్ని నింపింది. అనుకుని సంఘటనతో ప్రాణాలు విడిస్తే, నెల రోజులకు గానీ కుటుంబసభ్యులకు సమాచారం లేకుండా పోయింది.

Telangana: సౌదీలో తెలంగాణవాసి మృతి... నెల రోజుల తరువాత వెలుగులోకి నిజం..!
Mortuary
Peddaprolu Jyothi
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 04, 2024 | 4:30 PM

Share

ఎన్నో ఆశలతో తన కుటుంబ పోషణ కోసం.. బ్రతుకు దెరువు కోసం.. దేశం కానీ దేశానికి వెళ్ళాడు.. అక్కడ పనులు చేసుకుని తన కుటుంబాన్ని చూసుకోవాలి అనుకున్నాడు. కానీ విధి వారి కుటుంబంలో ఓ తీరని విషాదాన్ని నింపింది. అనుకుని సంఘటనతో ప్రాణాలు విడిస్తే, నెల రోజులకు గానీ కుటుంబసభ్యులకు సమాచారం లేకుండా పోయింది.

బ్రతుకు భారం అవుతున్న సమయంలో తన కుటుంబ పోషణ కోసం కొన్ని వేల కిలోమీటర్లు దాటి సౌదీకి వెళ్ళాడు షరీఫ్ అనే వ్యక్తి. అక్కడకు చేరుకున్న మూడు రోజుల్లోనే ప్రాణాలను కోల్పోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా తెలుసుకుని మార్చురీలో భద్రపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యజమాని తాను పనికి పిలిపించుకున్న వ్యక్తి పారిపోయాడు అంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో అరబ్ పోలీసులు అతని పేరును ప్రాక్టీస్‌లో పెట్టారు. అనంతరం నెల రోజుల తర్వాత షరీఫ్ చనిపోయిన విషయం స్వదేశంలోని కుటుంబ సభ్యులకు తెలిసింది.

తెలంగాణకు చెందిన మహమ్మద్ షరీఫ్ ఉపాధి కోసం తన కుటుంబాన్ని పోషించడానికి సౌదీకి జూన్ 3న డ్రైవర్ పని కోసం వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన మూడు రోజులకే పార్కులో సరదాగా కూర్చొన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, కూర్చున్నచోటే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుర్తు తెలియని మృతదేహంగా భావించి మార్చురీకి తరలించారు. నెల రోజుల దాటినా మృతడి గురించి ఎవరు రాకపోవడంతో ఎక్కడా కనీసం ఆధారాలు కూడా దొరకకపోవడంతో బయోపిక్ మెట్రిక్ విధానం ద్వారా షరీఫ్ వివరాలను కనుక్కున్నారు పోలీసులు.

అయితే అప్పటికే షరీఫ్ సమాచారం గురించి అతని యాజమాని అడుగుతున్నట్లు తెలుసుకున్నారు. విధి నిర్వహణ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడంటూ యజమాని కేసు పెట్టారు. అప్పటికే అతడి పేరు బ్లాక్ లిస్టులో చేర్చిన పోలీసులు పాస్‌పోర్ట్ ఆధారంగా భారత రాయబారి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో షరీఫ్ మరణ వార్తను వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సౌదీలోనే ఉంటున్న షరీఫ్ బంధువు ఒకరు మృతదేహాన్ని చూసి గుర్తుపట్టగా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చివరికి ఇండియన్ ఎంబసీ సహాయంతో అతని మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని వచ్చారు. దీంతో నెల రోజులు పాటు షరీఫ్ ఏమయ్యాడో అంతుచిక్కన పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి చివరకు షరీఫ్ మరణ వార్త తెలియడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..