‘రామాంజనేయ రాజకీయం’ అసలు కథేంటి..? కారు షెడ్డుకే పరిమితమా..?
ఒకటి తగ్గింది. కాంగ్రెస్-బీజేపీ మధ్య నడుస్తున్న మత రాజకీయాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఒకటి తగ్గిందన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే.. బీఆర్ఎస్ మిసస్సింగ్. చర్చ-రచ్చ, కామెంట్-కౌంటర్, అటాక్-కౌంటర్ అటాక్.. అంతా కాంగ్రెస్-బీజేపీ మధ్యే నడుస్తోంది. మరి.. బీఆర్ఎస్ ఎక్కడ? జరుగుతున్నదంతా బీఆర్ఎస్‌ను సైడ్ చేసేందుకా? లేదా పొలిటికల్ వార్.. బీజేపీ కాంగ్రెస్ మధ్యే నడిచేందుకా? ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి?

రాజకీయం.. ప్రతిరోజు నడుస్తూనే ఉండాలి. ఆ టాపిక్ ఏదైనా సరే. రోజుకో అంశంపై పొలిటికల్ వార్ జరుగుతూనే ఉండాలి. అప్పుడే కదా పొలిటీషియన్స్‌కి మజా. తెలంగాణలో అలాంటి పొలిటికల్ హీట్ ఉన్న వ్యవహారమే నడుస్తోంది. అదే మత రాజకీయం. అప్పుడెప్పుడో.. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు రాజకీయ తెరపైకి వచ్చింది. ఓ డౌట్? ఇప్పుడే ఎందుకొచ్చిందీ టాపిక్? అప్పుడంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనా? ఆ తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయనా? అందుకేనా బీజేపీని టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ ఈ కామెంట్స్ చేసింది..! గురి తప్పకుండా వేసిన డైలాగ్స్ కదా.. కమలదళం నుంచి కూడా అంతే రియాక్షన్ వచ్చింది. ఇంతకీ.. ఈ అంశంలో ఎవరు విసిరిన వలలో ఎవరు పడ్డారు? మధ్యలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అసలు.. బీఆర్‌ఎస్‌ను సైడ్ చేసేందుకేనా ఈ టాపిక్‌ను తెరపైకి తెచ్చింది? తెలంగాణలో మత రాజకీయం వెనక ఉన్న అసలు వ్యూహమేంటి? ఇదే ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది. జనరల్‌గా.. రాజకీయాల్లో మతం-దేవుడు అనగానే కళ్లు, వేళ్లు అన్నీ భారతీయ జనతా పార్టీ వైపే చూపుతాయి. ఎన్నికలు ఉన్నా, లేకున్నా మతం కోణంలోనూ మాట్లాడుతుంది ఆ పార్టీ. అలాగని తమని కించపరిచారని తీసుకోదు బీజేపీ. ఎస్.. బరాబర్ మతం-దేవుడు గురించి మాట్లాడేదే తాము అని కౌంటర్ ఇస్తుంటుంది. కాకపోతే.. ఈసారి అలాంటి రాజకీయానికి తెర...




