Telangana Holidays 2023: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
2023 సంవత్సరానికి సంబంధించి సెలవుల వివరాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి.
2023 సంవత్సరానికి సంబంధించి జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్టును తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విడుదల చేశారు. మొత్తం 2023లో 28 జనరల్ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి.
సాధారణ సెలవులు..
- జనవరి 1 – నూతన సంవత్సరం
- జనవరి 14 – భోగి
- జనవరి 15 – సంక్రాంతి
- జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
- మార్చి 7 – హోళీ
- మార్చి 22 – ఉగాది
- మార్చి 30 – శ్రీరామనవమి
- ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 14 – అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 22 – రంజాన్
- ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
- జూన్ 29 – బక్రీద్
- జులై 17 – బోనాలు
- జులై 29 – మొహర్రం
- ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
- సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
- సెప్టెంబరు 18 – వినాయక చవితి
- సెప్టెంబరు 28 మిలాద్-ఉన్-నబి
- అక్టోబర్ 2 – గాంధీ జయంతి
- అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
- అక్టోబరు 24 – విజయదశమి
- అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
- నవంబర్ 12- దీపావళి
- నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
- డిసెంబరు 25 – క్రిస్మస్
- డిసెంబర్ 26 – బాక్సింగ్ డే
మిగిలిన సెలవుల వివరాలను దిగవ ట్వీట్‌లో చూడండి
#Telangana Govt notifies General & Optional holidays for the year 2023. pic.twitter.com/gkNOVH8R0A
— Janardhan Veluru (@JanaVeluru) November 16, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం