Sharmila vs Revanth Reddy: తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంపై సంచలన కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
Sharmila vs Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తనయ, వైఎస్ షర్మిల పార్టీ పెడ్డటంపై టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి..

Sharmila vs Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తనయ, వైఎస్ షర్మిల పార్టీ పెడ్డటంపై టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి నష్టం చేకూర్చే ఉద్దేశంతో పాటు.. ఇతర రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయని ఆరోపించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. షర్మిల పార్టీతో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపైనా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జులై 9వ తేదీన జరగాల్సిన కేఆర్ఎంబీ మీటింగ్‌ను జులై 20వ తేదీకి వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కృష్ణా మీద ప్రాజెక్టులను పెడ్డింగ్‌లో సీఎం కేసీఆర్‌కు దురుద్దేశాలు ఉన్నాయన్నారు. కృష్ణా జలాల జగడంతో రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించి ఓట్లు పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్లాన్‌లో భాగంగానే.. సీఎం కేసీఆర్ ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను కాపాడటం కన్నా మించిన పని ఏముందని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా కోరాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
ఇదిలాఉంటే.. ఆదివారం నాడు దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంలోనూ కృష్ణా జలాల అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం అయ్యిందంటే.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే వల్లమాలిన ప్రేమ ఉందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మొదట పోరాటం చేసింది పీజేఆర్ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తన పోరాటాన్ని సాగించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీజేఆర్ చనిపోయిన తరువాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకపోయారని అన్నారు.
Also read:
Telangana Cm Kcr: ఆ మాట చెబితే ఎవరూ నమ్మలేదు.. గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్..
