ఏపీ ప్రజలను రాక్షసులుగా చిత్రించడం తప్పు.. ఎన్నికల సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బ తీయకూడదు : కిషన్ రెడ్డి
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కార్ కమలం డైలాగ్ వార్ ఒక రేంజ్ లో నడుస్తోంది...
Kishan Reddy comments : హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కార్ కమలం డైలాగ్ వార్ ఒక రేంజ్ లో నడుస్తోంది. కేంద్రం, తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని కేసీఆర్ అనడం సరికాదంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఉచిత వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా వైద్య పరికరాలు ఇచ్చాం. కేటీఆర్ లెటర్ రాయక ముందే తాము టెస్టింగ్ సెంటర్ కు ఆమోదం తెలిపామనీ.. కృష్ణా నీటి వైఫల్యాన్ని కేంద్రం మీదకు నెట్టేయడం సరికాదనీ అన్నారాయన.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాక్షసులుగా చిత్రించడం తప్పన్నారు కిషన్ రెడ్డి. జల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలి. అంతేకానీ ఎన్నికల సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బ తీయకూడదన్నారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడం ఖాయం. మా సర్వేలో కూడా బీజేపీయే గెలుస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ఇలా ఉండగా, టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హుజూరాబాద్ లో ఎలాగైనా సరే గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది కమలదళం. దీంతో తమ సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధమవుతోంది కాషాయపార్టీ. తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఇక్కడే మకాం వేసి.. ఎలాగైనా సరే గెలుస్తామంటున్నారు. ప్రజాస్వామిక తెలంగాణకోసం మరోమారు పోరాటానికి సిద్ధమంటున్నారు.
Read also : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల అలంకరణకు పిలుపు, పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ