Telangana Politics: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా.. అధికార పార్టీ ఆడుతోన్న మైండ్‌గేమా..?
పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ చెప్పడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఓపక్క ఫిరాయింపుల చట్టం మేనిఫెస్టోలో పెట్టి చేరికలా అని బీఆర్‌ఎస్ ప్రశ్నించింది. ఇంతకూ 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా లేక అధికార పార్టీ ఆడుతోన్న మైండ్‌గేమా అనేది తెలియక బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ చెప్పడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఓపక్క ఫిరాయింపుల చట్టం మేనిఫెస్టోలో పెట్టి చేరికలా అని బీఆర్‌ఎస్ ప్రశ్నించింది. ఇంతకూ 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా లేక అధికార పార్టీ ఆడుతోన్న మైండ్‌గేమా అనేది తెలియక బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. తమకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లే 104గా ఉన్న BRS ఎమ్మెల్యేల సంఖ్య దారుణంగా పడిపోయిందన్నారు ఉత్తమ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా ఇక బీఆర్ఎస్ కనిపించదన్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని, త్వరలోనే మరికొందరు రానున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ఓ వైపు రాహుల్ చెబుతుంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ మరో ఎజెండాతో ముందుకెళ్తున్నారా అని ప్రశ్నించారు. వంద రోజులు పూర్తయినా కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ రాజకీయ సంచలనాల కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక మంత్రుల వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. సొంత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారన్నారు పొన్నాల లక్ష్మయ్య.
ఇదిలావుంటే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 చోట్ల నెగ్గింది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ చెప్పినట్టుగా మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్ ఖాళీ అయిపోవడం ఖాయమే. అయితే ఆ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరనేది లోక్‌సభ ఎన్నికల్లోపు వెల్లడవుతుందా లేక మరికొంత సమయం ఆగాలా అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
