Nayeem Case re-open: నయీం అక్రమ సొమ్మంతా ఎవరి చేతికి వెళ్లింది..? ఆస్తులన్నీ ఏమయ్యాయి..?
పొలిటికల్‌గా హీట్ పెంచుతున్న నయీం కేసును ప్రభుత్వం రీఓపెన్ చేస్తుందా...? గతంలో విచారణలో జరిగిన అవకతవకలు వెలికితీసి.. బాధ్యులను శిక్షిస్తుందా...? గ్యాంగ్ స్టర్ ఆస్తులను రికవరీ చేస్తుందా లేదా...? బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ కూడా నయీం కేసు రీ-ఓపెన్‌కి పట్టుబట్టడానికి కారణాలేంటి..? అసలింతకీ నయీం డైరీలో ఏముంది..?

అప్పుడెప్పుడో 2016లో ఎన్‌కౌంటర్ అయిన నయీం పేరు.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో రీసౌండ్ ఇస్తోంది. నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ నేతలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు సడెన్‌గా తెలంగాణ పాలిటిక్స్‌లోకి నయీం పేరు ఎందుకొచ్చింది..? బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ కూడా నయీం కేసు రీ-ఓపెన్‌కి పట్టుబట్టడానికి కారణాలేంటి..? అసలింతకీ నయీం డైరీలో ఏముంది..?
40కి పైగా హత్యలు, బెదిరింపు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, వందల కోట్ల ఆస్తులు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్‌గా మారి, 2016లో ఎన్‌కౌంటర్ అయిన నయీంకు సంబంధించిన కేసు ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది. నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ వివిధ పార్టీల నేతలు పట్టుబట్టటం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఎన్‌కౌంటర్ తర్వాత నయీం డైరీలో ఏం దొరికిందన్న ఆంశంపై పట్టుబడుతున్నారు నేతలు. అయితే అప్పట్లో నయీంకి కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 20 ఇళ్ళు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నయీం వాటిని డెన్లుగా వాడుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు సిట్ తెలిపింది. నయీంకు హైదరాబాద్‌లోనే కాదు, గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 1993 నుంచి 2016 వరకు నయీం నేరాలు చేయడంలో రెచ్చిపోయాడని, వందల కొద్ది సెటిమెంట్లు, భూదందాలు, హత్యలకు పాల్పడినట్లు తేల్చారు. బ్యాంకుల్లో కాకుండా డబ్బును తన దగ్గరే పెట్టుకునేవాడని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు నయీంతో చేతులు కలిపారన్న వాదనలూ ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇవే విషయాలు గుర్తు చేస్తున్నారు వివిధ పార్టీల నేతలు. గత ప్రభుత్వం నయీం కేసును నీరుగార్చిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు నయీం అక్రమ సొమ్మంతా ఎవరి చేతికి వెళ్లింది..? భూదందాలతో వెనకేసుకున్న ఆస్తులన్నీ ఏమయ్యాయి..? నయీంతో చేతులు కలిసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరు..? ఇలాంటి విషయాలన్ని బయటకు తెలియాలి. నిందితులను పట్టుకోవాలంటూ పట్టుబడుతున్నారు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేతలు.
ఇటు నయీం కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. నయీం ఆస్తులు చాలా వరకు బీఆర్‌ఎస్ ముఖ్య నేతల చేతుల్లోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నయీం ఆస్తులను కొందరు నేతలు నొక్కేశారని గతంలో ఆరోపించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కేసును ఎందుకు రీఓపెన్ చెయ్యట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న అధికార పార్టీ నేత వీహెచ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నయీం కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ఇప్పుడు కేసును మళ్లీ రీఓపెన్ చేసి ఎవరి పాత్ర ఏంటనేది తేల్చాలన్నారు వీహెచ్.
మొత్తంగా… పొలిటికల్‌గా హీట్ పెంచుతున్న నయీం కేసును ప్రభుత్వం రీఓపెన్ చేస్తుందా…? గతంలో విచారణలో జరిగిన అవకతవకలు వెలికితీసి.. బాధ్యులను శిక్షిస్తుందా…? గ్యాంగ్ స్టర్ ఆస్తులను రికవరీ చేస్తుందా లేదా…? అన్నది సస్పెన్స్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
