AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Movie: బలగం జపం చేస్తోన్న రాజకీయ నాయకులు .. బలగం పోస్టర్స్‌తో నయా ట్రెండ్‌కు నేతలు శ్రీకారం

బలగం సినిమా టైటిల్ ను రాజకీయ నాయకులు వాడుకోవడం ట్రెండ్ గా మారింది. ‘బలగం జపం’.. ఫొటోలకు టైటిల్‌తో ప్రచారం.. చేసు కుంటున్నారు. తమ ఫోటోలకు బలగం టైటిల్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ప్రచారంలో నయా ట్రెండ్ గా మారింది.

Balagam Movie: బలగం జపం చేస్తోన్న రాజకీయ నాయకులు .. బలగం పోస్టర్స్‌తో నయా ట్రెండ్‌కు నేతలు శ్రీకారం
New Trend Balagam Movie
Surya Kala
|

Updated on: Apr 04, 2023 | 12:09 PM

Share

సినిమాల ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. హిట్ అయిన సినిమాల్లోని డైలాగులను రాజకీయ నాయకులు తమ ప్రచారంలో వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఓ సినిమా టైటిల్ ను తమ ఫోటోలకు జత చేసి నయా ట్రెండ్ కు నేతలు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పల్లె జీవనం, కుటుంబ సంస్కృతులకు అద్దం పడుతూ చిత్రీకరించిన బలగం సినిమా.. చూసిన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రజల మనసులను చూరగొని అనూహ్య విజయం సాధించింది. పల్లెల్లోనైతే ఏకంగా ఊరు ఊరంతా ఒక చోట చేరి బలగం సినిమా ప్రదర్శన తిలకిస్తూ, సినిమా కథను తమ కుటుంబాల్లోని కథగా భావిస్తూ చెమ్మగిల్లి నా కళ్లతో సినిమా చూసి ఆదరిస్తున్నారు.

బలగం సినిమా టైటిల్ ను రాజకీయ నాయకులు వాడుకోవడం ట్రెండ్ గా మారింది. ‘బలగం జపం’.. ఫొటోలకు టైటిల్‌తో ప్రచారం.. చేసు కుంటున్నారు. తమ ఫోటోలకు బలగం టైటిల్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ప్రచారంలో నయా ట్రెండ్ గా మారింది. సినిమాకు వచ్చిన ప్రజాదరణతో నాయకులు ఆ సినిమా టైటిల్ ను తమ ప్రసంగాల్లో ఫోటోలలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకొని చోటామోటా నాయకులు వరకు తమ ప్రసంగాల్లో కార్యకర్తలే నా బలం ప్రజలే మా బలగం అంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. కొందరైతే తమ ఫోటోలకు బలగం సినిమా టైటిల్ పెట్టి కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగం అంటూ వాట్సప్ చిత్రాలను షేర్ చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఫోటోలతో పాటు బలగం టైటిల్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, గల్లీ లీడర్ల ఫోటోలతో కూడా ప్రచారం కొనసాగుతుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రి నుంచి గల్లి స్థాయి లీడర్ వరకు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. హిట్ కొట్టిన బలగం సినిమాను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల్లోనూ వారి అవసరాలకు తగ్గట్లుగా బలగం టైటిల్ వినియోగంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సినిమాల్లోని టైగర్, జన నేత వంటి సంబోధనలతోపాటు బుల్లెట్ దిగిందా లేదా వంటి డైలాగులను కూడా నేతల అభిమానులు, అనుచరులు ఫ్లెక్సీలో చూపిస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలంతా నా బలగం నా బలం అంటూ నేతల ఫోటోలతో పాటు సినిమా టైటిల్ తో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Reporter: Revan Reddy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..