TS SSC Paper Leak: నిన్న తెలుగు.. ఇవాళ హిందీ పేపర్.. తెలంగాణలో కొనసాగుతున్న లీక్స్ పర్వం..
తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే.

తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్ లీక్ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. ఇవాళ వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. ఇవాళ హిందీ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు.
లీక్ అయిన హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇది లీక్ కాదు, జస్ట్ సర్క్యులేట్ అంటూ అధికారులు పేర్కొంటున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో మాత్రం మిస్టరీగా మారింది. కాగా.. వరుసగా పేపర్లు లీక్ అవుతుండటంతో అటు విద్యార్థులు.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..