Telangana: టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై అనుమానాలు.. వారి ఉద్దేశం అదేనా?.. కూపీ లాగుతున్న పోలీసులు..

తాండూరులో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విచారణాధికారులు, విద్యాశాఖాధికారులు.

Telangana: టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై అనుమానాలు.. వారి ఉద్దేశం అదేనా?.. కూపీ లాగుతున్న పోలీసులు..
Question Paper Leak
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2023 | 9:58 AM

తాండూరులో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విచారణాధికారులు, విద్యాశాఖాధికారులు. ఎన్ని నిబంధనలను విధించినా లీకేజీలు ఆగకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం. అలాంటిది.. మొబైల్ ఫోన్‌ను ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకువెళ్లాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

కాగా, తాండూర్ పదవ తరగతి ప్రశ్నాపత్రం బయటకు రావడంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్న పత్రాన్ని బయటకు పంపడం పట్ల ఉద్దేశం ఏంటి అనే దానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వహకులకు సైతం ప్రశ్నాపత్రం వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో నలుగురిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. గైర్హాజరైన విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని బందెప్ప అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్లు గుర్తించారు పోలీసులు. 260 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 258 మంది హాజరు హాజరు అయ్యారు. హాజరుకాని విద్యార్థుల్లో ఒక విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని వాట్సప్‌లో సర్కులేట్ చేశాడు బందెప్ప. ఇన్విజిలేటర్‌గా ఉన్న శ్రీనివాస్.. బందెప్పకు సహకరించినట్లుగా గుర్తించారు పోలీసులు. బందెప్పను ముందుగానే ప్రశ్నాపత్రాన్ని పంపాలని అడిగాడు సమ్మప్ప. అయితే, పాఠశాల విద్యార్థుల కోసమా? లేక సమప్పకు తెలిసిన పిల్లల కోసమా? అనేదానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..