AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SI, Constable Final Results 2023: జూన్‌ మూడో వారం నాటికి ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు వెల్లడి.. ఒక్కోపోస్టుకు ఆరుగురు పోటీ

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియమాక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. మొత్తం 17,516 పోస్టులకు ఈ పరీక్షలు..

TS SI, Constable Final Results 2023: జూన్‌ మూడో వారం నాటికి ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఫలితాలు వెల్లడి.. ఒక్కోపోస్టుకు ఆరుగురు పోటీ
TSLPRB Final Results
Srilakshmi C
|

Updated on: Jun 02, 2023 | 12:06 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియమాక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. మొత్తం 17,516 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో ఎస్సై పోస్టులు 587 ఉండగా..కానిస్టేబుల్‌ పోస్టులు 16,929 వరకు ఉన్నాయి. దాదాపు 1,79,459 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షలకు హాజరవగా.. వీరిలో 1,50,852 (84.06%) మంది అర్హత సాధించారు. వీరిలో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో అర్హత సాధించారు. ఆ లెక్కన చూస్తే మొత్తం 1.09 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాదించినట్లు తేల్చారు. ఈ లెక్కన ఒక్కో పోస్టు కోసం సగటున ఆరుగురు పోటీ పడుతున్నారు.

పోలీస్‌ యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం కటాఫ్‌ మార్కులే ప్రాతిపదిక కానున్నాయి. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల ఖాళీల ఆధారంగానే కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయించనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేయనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో ఉన్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవనున్నారు. జూన్‌ మూడో వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు