AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Command Centre: హైదరాబాద్‌లో మరో మణిహారం.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్!

ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ణానం అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముస్తాబు అవుతోంది.

Police Command Centre: హైదరాబాద్‌లో మరో మణిహారం.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్!
Telangana Police Command Control Centre
Balaraju Goud
|

Updated on: Jan 30, 2022 | 8:04 AM

Share

Telangana Police Command Control Centre: తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌(Command Control Center) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్‌(Hyderabad) మహానగరానికి మరో మణిహారం నిలువ బోతోంది. ఫిబ్రవరిలో ప్రజా సేవకు అందుబాటులోకి తెచ్చే ఈ భవనాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్‌ పరిశీలించారు. అనువనువు నిఘా పెట్టేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.

పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్‌లో మరో కలికితురాయి. ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ణానం అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ముస్తాబు అవుతోంది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఈ భవనం ముగింపు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేయబోతున్న సందర్భంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ భవనాన్ని సందర్శించారు. బిల్డింగ్‌ పనులను పరిశీలించారు. ఫిబ్రవరి నెలలలో సీఎం చేతుల మీదుగా మెయిన్‌ కమాండ్‌ కంట్రోల్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

దీంతో వచ్చే నెల 15 లోపే పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి ENC గణపతి రెడ్డిని కోరారు. అంతకు ముందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భవనంలో ఒక లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే .. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టవచ్చు.

ఈ భవనం నిర్మాణం 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా.. తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు. ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ బీ సీ డీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్-బీ సీ డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-ఏ. హెలిప్యాడ్ తో కలిపి జీ ప్లస్ 20 అం తస్తుల్లో టవర్-ఏ నిర్మించారు. ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు ఉంటాయి.

Read Also….  Cold Hit Alert: రికార్డుస్థాయిలో పెరుగుతున్న చలి తీవ్రత.. మరో రెండు రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ