Telangana: ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్నారా.? ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హమీలను అమలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఉచితంగా బస్సుతో పాటు రాజీవీ ఆరోగ్య శ్రీ బీమా పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక చేయూత, రూ. 2500 ఆర్థిక సాయం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలకు అర్హులైన వారి నుంచి...
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాపాలన పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వకరించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హమీలను అమలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఉచితంగా బస్సుతో పాటు రాజీవీ ఆరోగ్య శ్రీ బీమా పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక చేయూత, రూ. 2500 ఆర్థిక సాయం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా ఏకంగా 1,25,84,383 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక హామీలను అమలు చేసేందుకు గాను, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కీలక సమావేశం చేపట్టనున్నారు.
సెక్రటేరియట్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు పాల్గొననున్నారు. ఎంపీ ఎన్నికలలోపు హామీలను అమలు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. అభయహస్తం హామీలకు దరఖాస్తు చేసుకునున్న వారిని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. సైబర్ నేరస్థులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు, ఇల్లు, మంజూరు అయ్యాయి. మీ ఫోన్ నెంబర్‌కు మేము ఓటీపీ పంపించాము మాకు ఆ ఓటీపీ చెప్పండి అంటూ ఫోన్‌లు చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఫేక్ అని, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్ ప్రారంభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత విషయాలు కానీ ఓటీపీ కానీ ఎవరికీ చెప్పొందంటూ సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..