AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కదారి పడుతున్న పాలిటిక్స్.. ఇలాంటి వారి వల్ల పార్టీ ఓడిపోయిందిః అరెకపూడి గాంధీ

కౌశిక్ వర్సెస్‌ గాంధీ ఎపిసోడ్‌.. పీక్స్‌కి చేరింది. అరెకపూడి, కౌశిక్‌రెడ్డి మాటల దాడితో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి ఉద్రిక్తతలతో ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు.

పక్కదారి పడుతున్న పాలిటిక్స్.. ఇలాంటి వారి వల్ల పార్టీ ఓడిపోయిందిః అరెకపూడి గాంధీ
Arekapudi Gandhi Mla Koushik Reddy
Balaraju Goud
|

Updated on: Sep 13, 2024 | 5:48 PM

Share

కౌశిక్ వర్సెస్‌ గాంధీ ఎపిసోడ్‌.. పీక్స్‌కి చేరింది. అరెకపూడి, కౌశిక్‌రెడ్డి మాటల దాడితో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి ఉద్రిక్తతలతో ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇరు పార్టీలకు చెందిన నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ముందస్తు హౌజ్ అరెస్ట్‌లతో పరిస్థితులను అదుపులోకి తీసుకుచ్చారు. పీఏసీ చైర్మన్‌ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావును మాత్రం ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతించారు.

తనని పదేపదే రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని పీఏసీ చైర్మన్‌ అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. మహిళలను కూడా కించపరిచేలా కౌశిక్‌రెడ్డి మాట్లాడారన్నారు. ప్రాంతీయ వైషమ్యాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని అరెకపూడి విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని డిస్ట్రబ్‌ చేసే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. సజావుగా సాగుతున్న పాలనను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే బీఆర్ఎస్‌ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తోందని ఆరోపించారు. సెటిలర్ల పట్ల కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు.

తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా? కౌశిక్‌రెడ్డి రౌడీయిజం చేయడం మంచిది కాదని, తీరు మార్చుకోవాలని గాంధీ సూచించారు. కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టినందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు గాంధీ. బీఆర్ఎస్ నేతలే దాడి చేశారు. మేము ఒక్కరిపై కూడా దాడి చేయలేదన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే రాళ్లు రువ్వారు, పూల కుండీలు విసిరారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పదేళ్లుగా సేవలందిస్తున్నానని, ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేదీ లేదన్నారు. కేసీఆర్‌ అంటే ఎప్పటికీ నాకు గౌరవమే. కేసీఆర్‌ మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. కానీ, కౌశిక్‌రెడ్డి వంటి వాళ్లు ఉంటే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు గాంధీ. నోటికి అదుపులేని మనిషిని ఊరు మీదకు వదిలేశారు. అలాంటి వారి వల్లే అధికారాన్ని కోల్పోయామన్నారు పీఏసీ ఛైర్మన్ గాంధీ. కౌశిక్‌రెడ్డి వల్ల కేసీఆర్‌ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుందని గాంధీ అన్నారు.

అంతకుముందు చెప్పినట్టుగా అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు కౌశిక్‌రెడ్డి. పోలీసుల కళ్లుగప్పి కొండాపూర్‌ నివాసం నుంచి బాచుపల్లి వచ్చిన కౌశిక్‌.. అక్కడి నుంచి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, పోలీసులు మాత్రం కౌశిక్‌ను అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇక, అరెకపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా ఉదయం నుంచి హైటెన్షన్‌ కొనసాగింది. బీఆర్‌ఎస్‌ నేతలు వస్తే వెల్‌కం అంటూ ఇంట్లో కుర్చీలు వేసి ఉంచారు అరెకపూడి. గాంధీకి మద్దతుగా ఆయన ఇంటికి వచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..