Pulse Polio In Telangana: ఈ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వద్దు.. హైదరాబాద్ లో నేటి నుంచి ఫిబ్రవరి 3 వరకూ పల్స్ పోలియో
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు...
Pulse Polio In Telangana: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ పోలియో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని ముఖ్య సూచనలు చేసింది. చిన్నారులకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారికి పోలియో చుక్కలు వేయించరాదని ఆరోగ్య శాఖ తెలిపింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరింది.
హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. 23 వేల 331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కల పంపిణీ కొనసాగనుంది. పోలియో ఫ్రీ దేశంగా భారత్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటలకు చుక్కల మందు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. జనవరి 17 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కావడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Also Read: నేడు దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం.. పలు సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ