DGP Mahender Reddy: మానవ అక్రమ రవాణాకు కళ్లెం వేస్తాం.. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు: డీజీపీ
DGP Mahender Reddy: మానవ అక్రమ రవాణాకు కళ్లెం వేస్తామని, బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మానవ..
DGP Mahender Reddy: మానవ అక్రమ రవాణాకు కళ్లెం వేస్తామని, బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను అన్ని కమిషనరేట్లు, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. మహిళలు, బాలికల భద్రతకు స్వచ్చంద సంస్థల సహకారంతో హైదరాబాద్‌లోని 12 కళాశాలల్లో విమెన్ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేశామని, ఆపరేషన్ స్మైల్-7 ముగింపు కార్యక్రమం శనివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అందులో భాగంగా జనవరి 1న ప్రారంభమై ఆపరేషన్ స్మైల్-7లో నెలాఖరు నాటికి 3,178 మంది చిన్నారులను రక్షించామని పేర్కొన్నారు. 2,188 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని, మిగతా వారిని వసతి గృహాలకు తరలించామని వివరించారు. కాగా, ఆపరేషన్ స్మైల్-7 కార్యక్రమాలపై రూపొందంఇచిన ప్రత్యేక పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు.