AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం

నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందారు.

Telangana: భార్య మరణం.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ఆళి వెంటే భర్త పయనం
Old Couple Died
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2022 | 12:01 PM

నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. తెల్‌దేవరపల్లిలో గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(87) లక్ష్మమ్మ(80) భార్యాభర్తలు. వయసు మీద పడ్డా… పట్టణాల్లో స్థిరపడ్డ పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనయానం సాగిస్తున్నారు. భార్య లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవాజామున మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన అంతిరెడ్డి..  మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. తెల్లవారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. భార్య లేకుండా బ్రతకలేక ఆ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది.  అంతిరెడ్డి-లక్ష్మమ్మను ఒకే చితిపై కుటుంబసభ్యులు దహనం చేశారు. ఈ విషయం తెలిసినవారు నిజమైన దాంపత్య బంధం అంటే ఇది కదా అని మాట్లాడుకుంటున్నారు.

Also Read: APSRTC: అదంతా మోసం, నమ్మొద్దు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక హెచ్చరిక

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

డబ్బులు డ్రా చేసేందుకు సాయం అడిగిన మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
డబ్బులు డ్రా చేసేందుకు సాయం అడిగిన మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!