APSRTC: అదంతా మోసం, నమ్మొద్దు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక హెచ్చరిక
సంక్రాంతి రద్దీతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ.. సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు నజర్ పెట్టారు.
ఆంధ్రాలోని నిరుద్యోగులకు అలెర్ట్. ఆర్టీసీలో జాబ్స్ ఇప్పిస్తామంటూ చీటింగ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంస్థ సూచించింది. అధికారిక ప్రకటన మినహా.. బయట ఎవరు ఇలాంటి మాటలు చెప్పినా మోసపోతున్నట్లు హెచ్చరించింది. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నవీన్ కుమార్ అనే వ్యక్తి యువతను మోసం చేస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఏపీఎస్ ఆర్టీసీ మదనపల్లి, విజయవాడ పేర్లతో ఫేక్ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసిన నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు బయట పడింది. మదనపల్లి, పలమనేరు డిపోల్లో జాబ్స్ భర్తీ అంటూ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి పేర్లతో చీటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో యువత, నిరుద్యోగుల్ని అలెర్ట్ చేస్తూ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. నవీన్ కుమార్‌తో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆర్టీసీలో ఉద్యోగాలు దినపత్రిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే భర్తీ చేస్తామని.. మోసపూరిత దళారులను నమ్మవద్దని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆర్టీసీ కోరింది.
ఇక సంక్రాంతి రద్దీతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ.. సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు నజర్ పెట్టారు. పాసింజర్స్ నుంచి ఫిర్యాదులు అందడంతో రవాణాశాఖ కమిషనర్ ప్రత్యేక స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు ప్రైవేటు ట్రావెల్స్‌ను తనిఖీ చేస్తున్నా రు. కరోనా రూల్స్ పాటించకపోయినా, అధిక ధరలు వసూలు చేసినా అక్కడిక్కడే చర్యలు తీసుకొంటున్నారు. ప్రైవేటు దోపిడీపై 91542 94722 నంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు కమిషనర్ సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించకుండా మోటార్ వాహనాల చట్టాలకు లోబడి వాహనాలను నడపాలని రవాణాశాఖ అధికారలు సూచిస్తున్నారు.
Also Read: qనేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ