AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..

Telangana Municipal Poll Results: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.. కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడగా.. మరికొన్ని ప్రాంతాల్లో వెలువడాల్సి ఉంది.. తెలంగాణ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ ఇస్తోంది.

Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..
Telangana Municipal Elections
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2026 | 12:57 PM

Share

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.. కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడగా.. మరికొన్ని ప్రాంతాల్లో వెలువడాల్సి ఉంది.. తెలంగాణ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. పలు చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుండగా.. బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. చాలా మునిసిపాలిటిల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి నెలకొంది. అంతేకాకుండా.. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడటం ఉత్కంఠ రేపుతోంది.. తెలంగాణ మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 9 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది..

ఈ మున్సిపాలిటీల్లో హంగ్..

జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత‌, జనగామ, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఈ మునిసిపల్స్ లో స్వతంత్రులు కీలకం కానున్నారు. అంతేకాకుండా.. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో ఒక్క ఓటుతో మూడో వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.

జనగామ మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ..

జనగామలో మొత్తం 30 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 12 వార్డుల్లో విజయం సాధించాయి.. నాలుగు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందారు. మరోచోట సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానుండటంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్ 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్ టీవీ 

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..