Sharmila new party: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Sharmila new party: వైఎస్‌ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ పెట్టినంత మాత్రనా తమ....

Sharmila new party: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 13, 2021 | 2:05 PM

Sharmila new party: వైఎస్‌ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ పెట్టినంత మాత్రనా తమకు జరిగే నష్టం ఏమి లేదని వ్యాఖ్యానించారు.  మీడియాతో మాట్లాడుతుండగా, షర్మిల పార్టీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఇది వరకు మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు పెట్టిన పార్టీలు ఏమయ్యాయో అందరికి తెలుసని అన్నారు. ఇప్పుడు కొత్తగా షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే జరిగేది ఏమి లేదన్నారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటిది పరాయి వాళ్లకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వరని అన్నారు. ఎవరు ఏ పార్టీ పెట్టినా.. తమకేమి నష్టం లేదన్నారు. 70 ఏళ్ల పాలనలో సంతోషంగా లేని ప్రజలు.. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు.

Also Read: Baby Birth: నాలుగున్నర కిలోల బరువుతో జన్మించిన శిశువు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమం