తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పొలంబాట.. తాము అధికారంలోకి వస్తే ఆ పథకాలు యథాతథంగా అమలు చేస్తామన్న భట్టి

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల గుండా కొనసాగుతున్న పొలం బాట కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లాకు చేరుకుంది. ఆయా జిల్లాల్లో రైతులతో..

  • K Sammaiah
  • Publish Date - 3:13 pm, Sat, 13 February 21
తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పొలంబాట.. తాము అధికారంలోకి వస్తే ఆ పథకాలు యథాతథంగా అమలు చేస్తామన్న భట్టి

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల గుండా కొనసాగుతున్న పొలం బాట కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లాకు చేరుకుంది. ఆయా జిల్లాల్లో రైతులతో కాంగ్రెస్‌ నేతలు ముఖాముఖి మాట్లాడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందుతున్నాయా.. సాగునీరు అందుతుందా, మద్దతు ధర, ఎరువులు, విత్తనాల వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి యూటర్న్ తీసుకుని.. దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు రైతులను, అటు మహిళలు మోసం చేసారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ధర్మపురి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ధర్మపురి కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను అమలుచేసి రైతాంగానికి తీరని నష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధపడ్డారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లను ఇక ఉండకపోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంపైన భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కొనుగోలు కేంద్రాలనను యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

 

ఏడు పదులు దాటిన వృద్ధురాలు.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌.. ప్రజా సేవకు వయసు అడ్డు కాదంటున్న అక్కమ్మ..