AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రుణాల ఆశతో ఏపీలో మీటర్లు పెడుతున్నారు.. కానీ కేసీఆర్ కు రైతులే ముఖ్యం.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో కేంద్రం ఆశ చూపినా తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని ఆ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి(Minister Prashant Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల....

Telangana: రుణాల ఆశతో ఏపీలో మీటర్లు పెడుతున్నారు.. కానీ కేసీఆర్ కు రైతులే ముఖ్యం.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్
Prashanth Reddy
Ganesh Mudavath
|

Updated on: May 13, 2022 | 10:56 AM

Share

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో కేంద్రం ఆశ చూపినా తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని ఆ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి(Minister Prashant Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రుణ పరిమితి ఆశ చూపడంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని వెల్లడించారు. ఆ రాష్ట్రంలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం ఇలాంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి ససేమిరా ఒప్పుకోలేదని వివరించారు. తమకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రైతులే తమకు ముఖ్యమని సీఎం చెప్పారన్నారు. బాల్కొండ(Balkonda) నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌లు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకు పోతుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఏమీ చేయలేకపోయారు. సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే వారికి గుణపాఠం చెప్తారు. తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల్లోనూ ఉర్దూ ఉంటుంది. అంత మాత్రాన దేశమంతా ముస్లిం కలెక్టర్లు ఉన్నారా? భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.

           – ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Telangana: వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అదే కారణమని సూపరింటెండెంట్ అనుమానం

వాన కురుస్తుందా..? ఎండ కాస్తుందా..? కొబ్బరికాయ చెప్తుంది .. ఆనంద్ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌