Yadadri: యాదాద్రిలో కంచికామకోటి పీఠాధిపతి.. రేపటి నుంచి నరసింహుడి జయంత్యోత్సవాలు

తెలంగాణ(Telangana) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) ని కంచికామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సందర్శించారు. స్వయంభువులను దర్శించుకున్న తరువాత కాసేపు ధ్యానం చేశారు.....

Yadadri: యాదాద్రిలో కంచికామకోటి పీఠాధిపతి.. రేపటి నుంచి నరసింహుడి జయంత్యోత్సవాలు
Yadadri
Follow us

|

Updated on: May 13, 2022 | 11:28 AM

తెలంగాణ(Telangana) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) ని కంచికామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సందర్శించారు. స్వయంభువులను దర్శించుకున్న తరువాత కాసేపు ధ్యానం చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం స్తంభోద్భవుడైన స్వామివారి పంచ రూపాలతో ఈ క్షేత్రం పునర్నిర్మితమవడం విశేషమని పీఠాధిపతి అన్నారు. కృష్ణ శిలతో సంపూర్ణంగా ఆలయాన్ని నిర్మించడం గొప్ప కార్యమని చెప్పారు. మహాద్భుతంగా రూపొందిన ఈ ఆలయ సందర్శన సర్వేజన సుఖినోభవంతుకు నిదర్శనమని ప్రవచనంలో స్వామి వ్యక్తం చేశారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామికి ఈవో గీత, ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. మరోవైపు.. స్తంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. పునర్‌ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత, ప్రధాన పూజారి నల్లంథిదిగల్‌ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు.

శనివారం ఉదయం మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్దనుడు, సాయంత్రం హవనం, హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారోత్సవం జరుపుతారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మూలమంత్ర హవనం, 9 గంటల నుంచి పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, రాత్రి నృసింహ జయంతి, నృసింహావిర్భావం పర్వాలు నిర్వహిస్తారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు స్వామి జయంతి మహోత్సవ వేడుకలు జరుగుతాయని ఈవో వివరించారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Karate Kalyani: కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి స్ట్రీట్ ఫైట్.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

భారత్ – పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగయ్యేనా.. దాయాది దేశం అడుగులు ఫలించేనా..?