Karate Kalyani: కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి స్ట్రీట్ ఫైట్.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

Karate Kalyani: కరాటే కళ్యాణి - యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి స్ట్రీట్ ఫైట్.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?
Karate Kalyani

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి చెంప పగలగొట్టారు కరాటే కళ్యాణి.. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా..

Rajitha Chanti

|

May 13, 2022 | 11:10 AM

కరాటే కళ్యాణి(Karate Kalyani).. యూట్యూబర్ శ్రీకాంత్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. గురువారం రాత్రి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి చెంప పగలగొట్టారు కరాటే కళ్యాణి.. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. దారుణమైన వీడియోలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కరాటే కళ్యాణి.. బిగ్ బాస్ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఆమె… హిందూమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకోవడమే కాకుండా.. తిరిగి అతని చేతిలో దెబ్బలు తిన్నారు. వీడియోల పేరుతో మహిళలతో అసభ్య కరంగా ప్రవర్తించడం… అలాగే అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు శ్రీకాంత్‌ రెడ్డి యూట్యూబర్‌. ఈ వీడియో స్టార్‌ హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో కరాటే కళ్యాణికి కనిపించాడు అంతే శ్రీకాంత్ రెడ్డిని గుడ్డలూడదీసి కొట్టింది కరాటే కళ్యాణి.

కరాటే కళ్యాణి నివాసం ఉండే ఏరియాలోనే శ్రీకాంత్‌ రెడ్డి కూడా ఉంటాడు. గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని నిలదీసింది. ఫ్రాంక్ వీడియోలు తీస్తుండగా.. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించిన కరాటే కళ్యాణి అతని చెంప చెల్లుమనిపించింది. నువ్వు తీస్తున్న వీడియోలతో సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్‌ అంటూ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టడంతో గొడవ పెద్దదైంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి సైతం రివర్స్ అటాక్ చేశాడు.. తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి సైతం చెంప పగలకొట్టాడు.. ఈ కొట్లాటలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిని ఫుట్‌ బాల్ ఆడేశారు.. కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి మరీ గుడ్డలీడదీసి కొట్టేసింది. తనపై దాడితో శ్రీకాంత్‌ రెడ్డి కూడా రియాక్ట్‌ అయ్యాడు. ఎందుకు కొట్టావ్‌ అంటూ తిరగబడ్డాడు. ప్రాంక్‌ చేస్తే తప్పేంటి అంటూ దాడికి పాల్పడ్డాడు. ఎస్‌ఆర్‌ నగర్‌ టు మధురానగర్‌ వరకు జరిగిన ఈ గొడవ గంటపాటు రచ్చ క్రియేట్‌ చేసింది.

ఇలాంటి ప్రాంక్‌ల పేరుతో మహిళలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడని…ఎక్కడ బడితే అక్కడ చేతులేస్తూ…అడల్ట్ కంటెంట్ వీడియోలతో పబ్బం గడుపుకుంటున్నాడని..అతని యూట్యూబ్‌ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంది కళ్యాణి.. అయితే తన వీడియోలపై అభ్యంతరం ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి అంటున్నారు. తనపై చేయి చేసుకోవడానికి కరాటే కళ్యాణి ఎవరేది ఆయన ప్రశ్నిస్తున్నారు. లక్ష రూపాయలు ఇవ్వనందుకే తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్.. మహిళల్ని అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఆంటీలు, అమ్మాయిలపై ఫ్రాంక్ వీడియోలు తీస్తూ.. వాళ్లతో పచ్చి బూతులు మాట్లాడిస్తూ.. సెక్స్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఇప్పుడీ రచ్చతో ప్రాంక్ వీడియోలు పబ్లిక్ లైఫ్‌ను ఎంత డిస్ట్రబ్ చేస్తున్నాయో కళ్లకు కడుతున్నాయని అంటున్నారు. ప్రాంక్ వీడియోలతో సభ్య సమాజానికి ఏం మేసేజ్‌ ఇస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లు ప్రాంక్ వీడియోల పేరుతో లేడీస్‌తో ఎంత వల్గర్‌గా బిహేవ్ చేస్తారో…అతని పాత వీడియోలు చూస్తే తెలుస్తుందని. వీటి వల్ల ఒక్కరూపాయి ఉపయోగం ఈ సమాజానికి ఉందా…అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రజాసంఘాలు. ప్రాంక్‌ల పేరుతో పిచ్చి పిచ్చివేషాలు వేసే ఇలాంటి వాళ్లను యూట్యూబ్‌ నుంచే కాదు…కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu