భారత్ – పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగయ్యేనా.. దాయాది దేశం అడుగులు ఫలించేనా..?

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల మెరుగుదలకు పాకిస్తాన్(Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని హైకమిషన్‌లో నూతన వాణిజ్య అధికారిగా ఖమర్ జమాన్‌ను నియమించింది. పుల్వామా దాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌పై...

భారత్ - పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగయ్యేనా.. దాయాది దేశం అడుగులు ఫలించేనా..?
India Pak Trading
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 13, 2022 | 10:07 AM

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల మెరుగుదలకు పాకిస్తాన్(Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని హైకమిషన్‌లో నూతన వాణిజ్య అధికారిగా ఖమర్ జమాన్‌ను నియమించింది. పుల్వామా దాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడింది. 2019 ఆగష్టు లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత వాణిజ్యం(India – Pakistan Trading) పూర్తిగా నిలిచిపోయింది. పాక్ కు భారత్ వాణిజ్యం పూర్తిగా నిలిపివేసినప్పటికీ కూరగాయలు, చక్కెరతో పాటు అత్యవస వస్తువులను దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆగష్టు 2019లో వాణిజ్యాన్ని నిలిపివేయడానికి ముందు ప్రపంచ బ్యాంక్ అధ్యయనం $37 బిలియన్ల వాణిజ్య సామర్థ్యాన్ని అంచనా వేసింది. 2020లో, రెండు దేశాల మధ్య వాణిజ్యం $300 మిలియన్ కంటే తక్కువగా ఉంది. పాకిస్తాన్‌కు భారతదేశ ఎగుమతులు $293 మిలియన్లు కాగా, పాకిస్తాన్ నుండి దిగుమతులు $2.42 మిలియన్లుగా ఉన్నాయని అంచనా వేసింది. సాధారణంగా పాకిస్తాన్ తమ దేశ అవసరాల కోసం 40 శాతం గోధుమలను ఉక్రెయిన్, రష్యా, భారత్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఆ దేశాలకు పాకిస్తాన్ 20-25 శాతం ఎక్కువ ధర చెల్లించి గోధుమలను కొనుగోలు చేస్తోంది.

2019 నుండి వాణిజ్యాన్ని తగ్గించడంతో యూఏఈ, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల ద్వారా అనధికారిక వాణిజ్య మార్గాలకు దారి ఏర్పడింది. స్మగ్లింగ్, థర్డ్-కంట్రీ రూటింగ్‌ను తొలగించే సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడం వల్ల దిగుమతి సెస్ పరంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా అవసరమైన ఆదాయాన్ని సమకూర్చింది. పాకిస్తాన్‌లోని చాలా మంది వ్యక్తులు వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధతలు తొందరగా తొలగిలే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పాక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకపోతే, ఆ దేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హరియాణా, పంజాబ్‌లోని భారతీయ రైతులకు వాణిజ్య కారిడార్‌లను అందించే పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని మరింత వాస్తవికంగా పునఃప్రారంభించాలని పాకిస్తానీ పెట్టుబడి నిపుణుడు ఇస్సామ్ హమీద్ ఓ కథనంలో విజ్ఞప్తి చేశారు.

అయితే వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంలో రాజకీయాలు అడ్డంకిగా మారాయి. 2021 ప్రారంభంలో, పాకిస్తాన్ అగ్ర ఆర్థిక నిర్ణయాధికార సంస్థ, కేబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ, వినియోగదారులు, వస్త్ర పరిశ్రమకు దేశీయ కొరతను తగ్గించడానికి భారతదేశం నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేయాలని నిర్ణయించింది. ఇది 20 నెలల విరామం తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించింది. కానీ, అజహర్ ప్రకటించిన మరుసటి రోజు, ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్యాన్ని పునరుద్ధరించలేమని ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తప్ప.. సంబంధాల సాధారణీకరణ సాధ్యం కాదని అప్పటి పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు భారత్‌తో సయోధ్యకు ఉన్న అవకాశాలను లేకుండా చేసింది. తన ట్వీట్ మోడీ గురించి కాదని, ఇమ్రాన్ వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. భారతదేశం, చైనా మధ్య స్నేహ పూర్వక సంబంధాలు లేనప్పటికీ, వాణిజ్యం వృద్ధి చెందుతోందన్న విషయాన్ని గమనించాలని పాకిస్తాన్ వాణిజ్య నిపుణులు అన్నారు. వారి మధ్య యుద్ధాలు జరిగినప్పటికీ.. భాష, ఆహారంతో సహా నాగరికత సంబంధాలను పంచుకుంటూనే ఉన్నారన్నారు. రెండు దేశాలలో మార్కెట్ల మధ్య దూరం తక్కువగా ఉండటంతో రవాణా ఖర్చులు తగ్గుతాయని, రెండు వైపులా వాణిజ్యంలో డిమాండ్, సరఫరా అంశాలపై ఇరు దేశాల మధ్య సాన్నిహిత్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆభరణాలు, సౌందర్య సాధనాలు, మందులు, గృహోపకరణాలు, వ్యక్తిగత ఉపకరణాలు, తమలపాకులు వంటి భారతీయ వస్తువులు పాకిస్తాన్ లో విశేష ఆదరణ పొందాయి.

కాబట్టి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెండు దేశాలకూ లాభం చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థపై ఇమ్రాన్ అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇమ్రాన్ కు క్రికెట్ తప్ప ఇంకా ఏమీ తెలియవని విమర్శించాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

వాన కురుస్తుందా..? ఎండ కాస్తుందా..? కొబ్బరికాయ చెప్తుంది .. ఆనంద్ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌

Mango: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా ఎలా గుర్తించాలో తెలుసా..

Andhra Pradesh: కాకినాడలో విషాదం.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్సై సూసైడ్