Ukraine-Russia War: ఉక్రెయిన్‌పై సుదీర్ఘ పోరాటం తక్కువగా ఉన్నా.. ఆశ్చర్యపోయే ఘటనలు ఉంటాయి.. పుతిన్‌ కీలక వ్యాఖ్యలు

Ukraine-Russia War:ఉక్రెయిన్‌- రష్యాల మధ్య వార్‌ కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. అయితే ఈ యుద్దాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి ..

Ukraine-Russia War: ఉక్రెయిన్‌పై సుదీర్ఘ పోరాటం తక్కువగా ఉన్నా.. ఆశ్చర్యపోయే ఘటనలు ఉంటాయి.. పుతిన్‌ కీలక వ్యాఖ్యలు
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2022 | 10:05 AM

Ukraine-Russia War:ఉక్రెయిన్‌- రష్యాల మధ్య వార్‌ కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. అయితే ఈ యుద్దాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ మాతృభూమిని రక్షించడానికే ఈ యుద్దం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల చర్యకు ప్రతి చర్యగానే సైనిక చర్య చేపట్టినట్టు వెల్లడించారు. రష్యా స్పెషల్‌ మిలటరీ ఆపరేషన్‌ ఉక్రెయిన్‌పై దండయాత్ర సుదీర్ఘ యుద్ధం కొనసాగనున్నట్లు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంబించిన తొలినాళ్లలో అణ్వాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అప్రమత్తం చేయడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అణ్వాయుధ క్షిపణి దాడులపై తమ సైన్యం మాక్‌ డ్రిల్‌ చేపట్టిందని రష్యా చేసిన ప్రకటన కలవరానికి గురి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తుందనే విషయాన్ని ఇటీవల పుతిన్ వివరించారు. మే 9న విక్టరీ డే వేడుకల్లో పాల్గొన్న పుతిన్‌ పరేడ్‌ను తిలకించారు. అయితే పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేవి చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధ వ్యూహంలో మార్పు, పూర్తి స్థాయి యుద్ధ ప్రకటన గురించి పెద్దగా ప్రకటన చేయలేదు.1945లో నాజీలపై రెడ్‌ ఆర్మీ సాగించిన పోరాటానికి ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పొలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దు అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని పుతిన్‌ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై అత్యవసర చర్యలేనని పుతిన్‌ ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకు పెరుగోతందన్నారు. నాటో విస్తరణ యోచన విరమించుకోవాలని కోరామన్నారు. అలాగే రష్యా సైనికులు సొంత దేశం భద్రత కోసం ఉక్రెయిన్‌పై వీరోచితంగా పోరాటం కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా చర్యను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ పోరాటంతో పోల్చారు పుతిన్‌.

 భద్రతను పరిరక్షించడమే రష్యా సేనల దాడులు

నియో నాజీలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించడం కోసమే ఈ సైనిక చర్య అని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో పాశ్చాత్య దేశాలు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఆయా దేశాల విధానాలకు ప్రతిచర్యగానే రష్యా బలగాలు ఉక్రెయిన్ లో పోరాటం సాగిస్తున్నాయని పుతిన్ వివరించారు. ఉక్రెయిన్‌ సమగ్రతను, భద్రతను పరిరక్షించడమే రష్యా సేనల దాడుల వెనుక ఉద్దేశం అని ఉద్ఘటించారు. అయితే ఉక్రెయిన్‌పై సుదీర్ఘ పోరాటం తక్కువగా ఉన్నా.. యుద్ధంలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యపోయే ఘటనలు ఉంటాయని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌పై తాము చేస్తున్నది యుద్ధం అని చెప్పకుండా ఇది ఒక ప్రత్యేకమైన సైనిక చర్య అని చెప్పుకొస్తున్నాడు పుతిన్‌.

ఇవి కూడా చదవండి

విక్టరీ డే పరేడ్‌లో పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చినా.. ప్రస్తుత పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అలాంటి ప్రకటనేమీ ప్రస్తుతానికి లేకపోడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్‌ సైనిక చర్యను ప్రకటించారు. అయితే పుతిన్‌ వ్యాఖ్యలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గట్టిగా కౌంటరిచ్చారు. త్వరలోనే ఉక్రెయిన్‌లో రెండు విజయోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.

పుతిన్‌ వ్యాఖ్యలపై బ్రిటన్‌ రక్షణ మంత్రి స్పందన:

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యలపై బ్రిటన్ రక్షణశాఖ మంత్రి బెన్ వాలెస్ స్పందించారు. మాస్కో పరేడ్‌లో చేసిన ప్రసంగంతో పుతిన్.. ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటున్నారని అన్నారు. రష్యా ప్రజలను, ప్రపంచాన్ని ప్రస్తుతం జరుగుతోన్న సైనిక చర్యను చూపి భయపెట్టాలని పుతిన్‌ భావిస్తున్నారని ఆరోపించారు. నిష్కారణంగా జరుగుతున్న ప్రస్తుత యద్ధంతో ఉపయోగం లేదని.. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను కచ్చితంగా ఇది అవమానించడమేనని బన్ వాలెస్ పేర్కొన్నారు.

తూర్పు ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా దాడులు:

తూర్పు ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా సైనికులు గురువారం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. మేరియుపొల్‌ హస్తగతానికి ఇతర నగరాల్లో ఇంకా చొచ్చుకుపోయేందుకు మరింత ప్రయత్నించారు. ఉక్కు కర్మాగార ఆవరణలో బంకర్లలో క్షతగాత్రులుగా ఉన్న తమ సైనికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహకరిస్తే దానికి బదులుగా తమ వద్ద యుద్ధ ఖైదీలుగా ఉన్న రష్యా సైనికులను విడుదల చేస్తామని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ ప్రాంతం మినహా మేరియుపొల్లోని మిగతా ప్రాంతాలు రష్యా నియంత్రణలోకి వెళ్లడంతో ఆహారం, తాగునీరు, మందులు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆదిపత్యం వల్ల నల్ల సముద్రం ఓడరేవుల దిగ్బంధం మినహా మరే పెద్ద కార్యాచరణ లాభాలు కనిపించడం లేదు. కివ్‌, ఖార్కివ్‌ చుట్టు పక్కల ఉత్తరాన ఉన్న ప్రాంతాలపై వివిధ కారణాల వల్ల దాడులు నిలిచిపోయాయి. యుద్ధాల కారణంగా ఉక్రెయిన్‌కు సైన్యం కొరతతో పాటు ఆయుధాలు, ఆహారం కొరత కూడా తీవ్రంగా ఉంది.

యద్ధంతో క్షీణించిన రష్యా ఆర్థిక వ్యవస్థ:

వెలువడుతున్న నివేదిక ప్రకారం.. రష్యన్లు 15,000 మంది వరకు చనిపోయారని, 30,000 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తోంది. అటు ఉక్రెయిన్‌ సైన్యం కూడా భారీగా నష్టపోయింది. వేలాది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ 12.5 శాతం క్షీణించింది. పారిశ్రామికోత్పత్తి 20-22 శాతం, విదేశీ పెట్టుబడులు 30-40 శాతం, వాణిజ్య సమతుల్యత 40-60 శాతానికి దిగజారింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచంలోని మొత్తం ధాన్యం ఎగుమతుల్లో 30 శాతం అందిస్తున్నారు. ఉక్రెయిన్‌ మొత్తం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో 50 శాతం, గ్లోబల్‌ మొక్కజొన్నలో 15 శాతం, బార్లీలో 12.6 శాతం అందిస్తోంది.

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (NOTO)లో ఉక్రెయిన్‌ చేరాలన్న ప్ర యత్నం రష్యా ప్రధాని పుతిన్‌ ఆగ్రహానికి కారణం కాగా, తాజాగా ఫిన్లాండ్‌ ఆ కూటమిలో సభ్యత్వానికి మొగ్గు చూపడం గమనార్హం. దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న తటస్థ వైఖరిని వీడి, ఎలాంటి కారణాలు లేకుండా ఈ పని పూర్తి చేయాలని ఆ దేశాధినేతలు నిర్ణయించారు. రష్యాను ఎదుర్కొనేలా పాశ్చాత్య దేశాలతో కలవాలని ఫిన్లాండ్‌ నిర్ణయించుకుంది. ఆ దేశానికి పొరుగున ఉండే స్వీడన్‌ కూడా కొద్ది రోజుల్లోనే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాటోలో ఫ్లిన్లాండ్‌ చేరితే అది రష్యా-ఫ్లిన్లాండ్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతీస్తుందని పుతిన్‌ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రష్యా ఫిన్లాండ్‌కు 1,340 కిలోమీటర్ల సరిమద్దు ఉంది.

త్వరలో మాకు రెండు విక్టరీలు: జెలెన్‌స్కీ

త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోనున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకులు ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని, రెండోప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధంలోనూ తప్పకుండా నెగ్గుతామని వ్యాఖ్యానించారు. ఖార్కీవ్‌ సమీపంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్‌ సేనలు తరిమికొట్టాయని జెలెన్‌స్కీ అన్నారు. మరియుపోల్లోని స్టీల్‌ ప్లాంట్‌ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోని ప్రధానప ప్రాంతాలపై 34 సార్లు రష్యా యుద్ధ విమానాలు దాడులకు తెగబడ్డాయని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source:

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?