AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదు.. మరింత నిఘా పెంచామన్న టీటీడీ ఈవో..

కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో పరకామణిలో చోరీపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పందించారు. శ్రీవారి ఆలయంలో పటిష్టమైన భద్రత ఉందన్నారు. పరకామణిలో గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదని..

TTD: గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదు.. మరింత నిఘా పెంచామన్న టీటీడీ ఈవో..
Ttd Eo Dharma Reddy
Sanjay Kasula
|

Updated on: May 13, 2022 | 11:46 AM

Share

కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో పరకామణిలో చోరీపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి(Dharma Reddy) స్పందించారు. శ్రీవారి ఆలయంలో పటిష్టమైన భద్రత ఉందన్నారు. పరకామణిలో గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చోరీ జరగలేదని.. శ్రీవారి హుండీలో చోరీలు జరుగుతాయి.. కానీ ఎప్పటికప్పుడు విజిలెన్స్ సిబ్బంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటారని తెలిపారు. దరిద్రమైన వ్యక్తులే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు చోరీ చేసిన డబ్బులను అండర్ వేర్ లో పెట్టుకోవడంతో సిబ్బంది గుర్తించలేకపోయారని అన్నారు. భక్తుల కష్టార్జితాన్ని కాజేసినందుకే శ్రీవారు నిందితుడిని పట్టించారని అన్నారు. పరకామణిలో భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు.

చోరీ ఎలా జరిగింది.. ఎలా వెలుగు చూసింది..

శ్రీవారి ఆలయంలోని  పరకామణి (Parakamani) మండపంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. రూ. 20వేల నగదును చోరీ చేశాడు. ఆలయ పరకామణిలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. కరెన్సీ లెక్కింపు మండపంలో నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అతడు చోరీకి పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే నిందితుడి చేతివాటం గురించి అతడి సహోద్యోగి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిఘా పెంచిన అధికారులు..

ఈ ఘటనపై ఆలయ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండే పరకామణిలో చోరీ జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని గొప్యంగా ఉంచి.. టీటీడీ(TTD) విజిలెన్స్ బృందం ద‌ర్యాప్తు చేసింది.