Minister KTR: మన నాయకుల దృష్టంతా రాజకీయాలపైనే.. దేశ భవిష్యత్ అవసరమే లేదు..!

దేశంలో లీడర్ల దృష్టంతా రాజకీయాలపైనే ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఎకనామిక్స్‌, భవిష్యత్ తరాల గురించి ఎప్పుడూ ఆలోచన చేయరన్నారు. ఇండియా ఎదుర్కొంటున్న

Minister KTR: మన నాయకుల దృష్టంతా రాజకీయాలపైనే.. దేశ భవిష్యత్ అవసరమే లేదు..!
Minister Ktr
Follow us

|

Updated on: Feb 02, 2023 | 2:12 PM

దేశంలో లీడర్ల దృష్టంతా రాజకీయాలపైనే ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఎకనామిక్స్‌, భవిష్యత్ తరాల గురించి ఎప్పుడూ ఆలోచన చేయరన్నారు. ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదేనన్నారు కేటీఆర్‌. ఎన్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు.

కేటీఆర్ ప్రసంగం యధావిధంగా..

‘నాలుగు ఏళ్లలోనే ప్రంపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ను నిర్మించాము. నిన్న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అనేక రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాయి. కానీ కేటాయింపుల్లో దేశ అభివృద్ధి కోసం ఎక్కడా జరిగినట్టు కనపడలేదు. చైనా జపాన్ లాంటి కంట్రీలు అభివృద్ధిలో ముందున్నాయి. మనదేశంలో 60 శాతం జనాభా యువతే. మనదేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. మన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఎందుకు మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదు. ఎవరు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని ఎదురుచూడడం ఎందుకు? ఎందుకు మన ఇండియా నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన బ్రాండ్స్ రావడం లేదు? సాంసంగ్, బీఎండబ్ల్యూ, ఎల్జి ఇలాంటి బ్రాండ్స్ ఎందుకు మన దేశం నుండి రావడం లేదు? చిన్న చిన్న దేశాలు మాత్రమే వాటిని ఎందుకు తయారు చేస్తున్నాయి? సింగపూర్ చాలా చిన్న దేశం.. మన హైదరాబాద్ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ ఇవాళ ఆర్థిక రంగంలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తుంది. మన నాయకులకు మాత్రం రాజకీయాలు మాత్రమే కావాలి. దేశాభివృద్ధి గురించి, దేశ యువత భవిష్యత్ గురించి వారు అస్సలు ఆలోచించరు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

వృద్ధి పథంలో తెలంగాణ..

‘తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తుంది. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రాత్ర గణనీయమైనది. దేశ జిడిపిలో ఐదు శాతం వాటా తెలంగాణదే. తెలంగాణ త్రీ ‘ఐ’ మంత్రతో ముందుకెళ్తుంది. ‘ఇన్నోవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్’ ను ప్రధానంగా తీసుకున్నాం. టిఎస్ ఐపాస్ తో.. కంపెనీలకు ఆన్లైన్ ద్వారా అనుమతిలిస్తున్నాం. 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతి ఇస్తాం. 16వ రోజు అనుమతి రాకపోతే ఆటోమేటిగ్గా అనుమతి ఇచ్చినట్టే. అమెజాన్ వరల్డ్ లార్జెస్ట్ క్యాంపస్ ఇవాళ హైదరాబాదులోనే ఉంది. గూగుల్, ఉబర్ లాంటి కంపెనీలు సెకండ్ క్యాంపస్‌లను అమెరికా తర్వాత హైదరాబాదులోనే ఉన్నాయి. దేశంలో 24 గంటల పాటు వాటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వాటర్ సదుపాయం కల్పించాము. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది తెలంగాణ ప్రభుత్వమే. హైదరాబాద్ అద్భుతమైన నగరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది.’ అని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..