Hyderabad Traffic Restrictions: భాగ్యనగర వాసులూ బహుపరాక్.. రేపటి నుంచి ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. నగరంలో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad Traffic Restrictions: భాగ్యనగర వాసులూ బహుపరాక్.. రేపటి నుంచి ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad Traffic Restrictions
Follow us

|

Updated on: Feb 02, 2023 | 2:15 PM

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. నగరంలో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆదివారాలు మినహా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇదే విషయాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లు, ప్రత్యామ్నాయ రూట్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే రూట్స్ ఇవే..

తెలుగుతల్లి- ఇక్బాల్‌ మినార్‌ – రవీంద్రభారతి- వి.వి.విగ్రహం- షాదన్‌కళాశాల- నిరంకారి- సైఫాబాద్‌ పాతపోలీస్‌స్టేషన్‌- మాసబ్‌ట్యాంక్‌- పీటీఐ బిల్డింగ్‌-అయోధ్య, నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌- బషీర్‌బాగ్‌ జంక్షన్‌ టు ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్‌, బీజేఆర్‌ విగ్రహం- ఏఆర్‌ పెట్రోల్‌పంప్‌- నాంపల్లి రైల్వేస్టేషన్‌- ఎంజేమార్కెట్‌- తాజ్‌ ఐలాండ్‌- బీఆర్‌కే భవన్‌- ఆదర్శ్‌నగర్‌- ఓల్డ్‌ పీసీఆర్‌, జంక్షన్‌- మినిస్టర్స్‌ రెసిడెన్సీ కాంప్లెక్స్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12- విరంచి హాస్పిటల్‌- మాసబ్‌ట్యాంక్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు-కేబీఆర్‌పార్క్‌-ఎల్వీప్రసాద్‌ ఐ హాస్పిటల్‌- శ్రీనగర్‌ కాలనీ జంక్షన్‌- నిమ్స్‌ – వి.వి.విగ్రహం ఈఎస్‌ఐ ఆసుపత్రి- ఎస్‌.ఆర్‌.నగర్‌ మెట్రోస్టేషన్‌-అమీర్‌పేట్‌ స్టేషన్‌- పంజాగుట్ట జంక్షన్‌- నిమ్స్‌- వి.వి.విగ్రహం సీటీవో జంక్షన్‌- ప్యారడైజ్‌- రాణిగంజ్‌- కర్బలా- చిల్డ్రన్‌పార్క్‌- ట్యాంక్‌బండ్‌- అంబేడ్కర్‌ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్‌మినార్‌-రవీంద్రభారతి ప్లాజా జంక్షన్‌- ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్‌- కర్బలా ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..