AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Ktr: ఏ దేవుడు చెప్పాడు తన పేరు మీద కొట్టుకోమని.. బీజేపీపై మంత్రి కేటీఆర్ సెన్షేషనల్ కామెంట్స్..

Minister Ktr: కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. పేదల పొట్ట నింపేందుకు ఇస్తున్న ఉచిత పథకాలను..

Minister Ktr: ఏ దేవుడు చెప్పాడు తన పేరు మీద కొట్టుకోమని.. బీజేపీపై మంత్రి కేటీఆర్ సెన్షేషనల్ కామెంట్స్..
Minister Ktr
Shiva Prajapati
|

Updated on: Aug 27, 2022 | 3:32 PM

Share

Minister Ktr: కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. పేదల పొట్ట నింపేందుకు ఇస్తున్న ఉచిత పథకాలను ఫ్రీ బీ అంటూ బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు, తిండి లేక ఎంతోమంది పేదలు ప్రాణాలు కోల్పోతుంటే.. విశ్వగురుగా చెప్పుకొనేందుకు సిగ్గుపడాలన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. దేశంలో ఎక్కడలేని సంక్షేమం తెలంగాణలో అమలవుతోందన్నారు. అన్నం లేక మరిణిస్తే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని పేర్కొన్నారు. విద్య, వైద్యం అందించలేని ప్రభుత్వాలకు అదొక సిగ్గుచేటు అన్నారు. వీటిని ఉచితాలు అని అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ‘రూ.12 లక్షల కోట్లను కార్పొరేట్‌ ట్యాక్స్‌లను రద్దు చేస్తారు.. బియ్యం, ఉచిత విద్యుత్‌ ఇస్తే తప్పా?’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ‘విశ్వగురువు అని ఎన్ని బిల్డప్‌లు ఇచ్చినా.. మనది కూడా పేద దేశమే’ అని అన్నారు. సమస్యల పరిష్కారం వదిలి కులం, మతం, ఆహారంపై పంచాయితీలు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరేం తింటే నీకెందుకు? అని నిలదీశారు. ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్‌ చేస్తున్నారంటూ బీజేపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్‌. దేశంలో జీడీపీ – గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ పెరిగిపోతోందన్నారు. దాని గురించి మాత్రం ఎవరూ నోరెత్తరన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు మాని.. మునావర్‌పైనా పంచాయితీ పెడుతున్నారని విమర్శించారు. ఏ దేవుడు చెప్పాడు తన పేరు మీద కొట్టుకోమని అంటూ కేటీఆర్ నిలదీశారు. దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్రానికి ఎవరెవరో వస్తున్నారు..

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్రానికి ఎవరెవరో వస్తున్నారని, నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. 8 ఏళ్లల్లో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించామన్నారు. నీళ్ల విషయంలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. సిరిసిల్ల జిల్లా ఒక కేస్‌ స్టడీగా మారిందని, ఐఏఎస్‌ అధికారులకు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాళేశ్వరం అని, రాబోయే వందేళ్లకు ఈ ప్రాజెక్టు ఒక కామధేనువు అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..