AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: తీరనున్న భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు.. కొత్తగా అందుబాటులోకి 5 లింక్ ‌రోడ్లు.. హైటెక్‌సిటీ వద్ద ప్రారంభించిన మంత్రి కేటీఆర్

భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. న‌గ‌రాలు అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే ర‌హ‌దారులు ముఖ్యమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.

Minister KTR: తీరనున్న భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు.. కొత్తగా అందుబాటులోకి 5 లింక్ ‌రోడ్లు.. హైటెక్‌సిటీ వద్ద ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister Ktr Inaugurates Newly Laid Five Link Roads
Balaraju Goud
|

Updated on: Jun 28, 2021 | 3:11 PM

Share

Minister KTR inaugurates newly laid Link Roads: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. న‌గ‌రాలు అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే ర‌హ‌దారులు ముఖ్యమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్లను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం అన్ని వైపులా విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో స‌ర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల కల్పనలోనూ దూసుకుపోతున్నామన్నారు. హైద‌రాబాద్ పెరుగుతున్న జ‌నాభాను దృష్టిలో ఉంచుకుని ఇందుకు అనుగుణంగా నిర్మాణ రంగంతో పాటు ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇప్పటికే నగరంలో 16 లింక్ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్న మంత్రి.. కొత్త సైబర్ సిటీని అన్ని ప్రాంతాలకు కలుపుతూ కొత్త నిర్మించామన్నారు. దీని ద్వారా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం నుంచి నోవాటెల్ గేట్ వరకు, మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మజీద్ వరకు, వసంత సిటీ నుంచి న్యాక్, జేవీజీ హిల్స్ నుంచి మజీద్ బండ వరకు కొత్తగా రహదారులను లింక్ చేశామన్నారు. వీటి ద్వారా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ బాగా తగ్గుతుందన్న మంత్రి.. దశలవారీగా మరిన్ని లింక్ రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెన‌లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామని అని మంత్రి తెలిపారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఎస్ఆర్డీపీతో పాటు సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్లతో ప‌లు అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. వీటితో అద‌నంగా హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింద మొద‌టి ద‌శ‌లో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న 5 లింక్ రోడ్ల నిర్మాణం రూ. 27.43 కోట్ల వ్యయంతో చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. రెండో ద‌శ‌లో రూ. 65 కోట్లతో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా రూ. 230 కోట్లతో మ‌రో 13 రోడ్లను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రింత పార‌ద‌ర్శకంగా రోడ్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ట్రాఫిక్, ప్రయాణ దూరం త‌గ్గించేలా లింక్ రోడ్లను పూర్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలితో మంత్రి కేటీఆర్ ఫోటో 

వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్ ను ప్రారంభించి వెళుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న చందానగర్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటిఆర్ పలకరించారు. ఆమె తలపై ధరించిన టోపి బాగుందని క్యాప్ ను సరిచేసి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. జీతం సమయానికి వస్తోందా అని అడిగితే మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది అని సైదమ్మ తెలిపింది. అయితే కాదమ్మ మూడు సార్లు పెంచామంటూ అంటూ కేటిఆర్ బదులిచ్చారు. పారిశుద్ధ్య కార్మకుల సేవలను మరువలేనివంటూ.. ఫోటో దిగుదామా అని అడిగి మరీ.. సైదమ్మతో మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఫోటో దిగారు. దీంతో సైదమ్మతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్ పారిశుద్ధ్య కార్మికులు ఉప్పొంగిపోయారు.

Minister Ktr And Sabitha Photo With Sanitation Worker

Minister Ktr And Sabitha Photo With Sanitation Worker

Read Also…DGP Mahender Reddy: తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదు.. లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తాంః డీజీపీ మహేందర్ రెడ్డి

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..