Telangana: వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరిక.. ఇకపై నెంబర్‌ ప్లేట్‌ కనిపించకపోతే అంతే సంగతులు..

TS Traffic Police: వాహనదారుల విషయంలో తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు కొత్త నిబంధనలు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు..

Telangana: వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరిక.. ఇకపై నెంబర్‌ ప్లేట్‌ కనిపించకపోతే అంతే సంగతులు..
Hyderabad Traffic Police
Follow us

|

Updated on: Jul 19, 2022 | 5:36 PM

TS Traffic Police: వాహనదారుల విషయంలో తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు కొత్త నిబంధనలు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని వాహనదారులకు పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల నెంబర్‌ ప్లేట్లకు ఇతర స్టిక్కర్స్‌ అతికించడం, నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా మాస్క్‌ వేయడం, పెండింగ్‌ చలానాలను ఎగ్గొట్టడం, కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు వేయడం నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కొరఢా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంతో మంది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ దర్జాతీ తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నజర్ పెట్టారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

అద్దాలకు బ్లాక్ ‌ఫిల్మ్‌లు అతికించిన కార్లను, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలు, పెండింగ్ చలానాలు క్లియర్ చేయకపోయినా.. అలాంటి వాహనాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. అంతేకాకుండా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసి.. నెల కావొస్తున్నా ఇంకా తాత్కాలిక నెంబర్‌తోనే తిప్పుతున్న వారిపై కూడా చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసేవారిపైసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం ఛార్జీషీట్లు దాఖలు చేసి.. వారిని కోర్టులో హాజరు పరుస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇక హైదరాబాద్‌ నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై నిఘా పెడుతున్న అధికారులు.. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్‌ పెట్టేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు