Telangana High Court: ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న పరిస్థితి గురించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసం ఒక శానిటరీ నాప్‌కిన్ డిస్పెన్సింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న పరిస్థితి గురించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసం ఒక శానిటరీ నాప్‌కిన్ డిస్పెన్సింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మూడు నెలల్లోగా ప్రభుత్వం దీనిపై స్పందించి ఒక నివేదికను సమర్పించాలని కోరింది. ఈ విషయంలోని సున్నితత్వంతో పాటూ అవసరాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై ప్రధాన న్యాయమూర్తి ఆరాధే ఆరా తీశారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్లీడర్లు.. ఇటీవల ప్రభుత్వం మారినందున దీనిపై పూర్తి వివరాలు ఇవ్వడానికి మరింత సమయం కావాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. ప్లీడర్ల వాదనపై సంతృప్తి చెందని ప్రధాన న్యాయమూర్తి, “ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి, ప్రభుత్వ మార్పుకు ఎలాంటి సంబంధం లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వివరాలు సేకరించడానికి కళాశాలల సెక్యూరిటీ సిబ్బంది సరిపోతుందని సమాధానం ఇచ్చింది.
దీనిపై న్యాయ మూర్తికి కొందరు లాయర్లు ఇలా వివరణ ఇచ్చారు. వివిధ పిటిషన్లలో, ప్రభుత్వ ప్లీడర్లతో పాటూ ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్ల మార్పు జరిగిందని.. అలాగే ప్రభుత్వ నాయకత్వంలో కూడా మార్పు వచ్చిందని గుర్తు చేశారు. వీటి మార్పుల నుండి ఉత్పన్నమయ్యే ఇబ్బందులను ఊటంకిస్తూ.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అదనపు సమయాన్ని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు మూడు నెలల్లోగా ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ ప్రత్యేక నివేదిక న్యాయస్థానానికి అందించాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..