Telangana: అసెంబ్లీ సమరం.. శ్వేతపత్రంపై చిటపటలు.. అసలు అందులో ఏముంది?
శ్వేతపత్రాలపై తెలంగాణ అసెంబ్లీలో పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పదేళ్లలో తాము సంపాదించిన ప్రగతి ఇదిగో అంటూ బీఆర్‌ఎస్ ఏకంగా డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తే.. మీరు చేసిన అప్పుల నిర్వాకం ఇదేనంటూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. అంతా తప్పుల తడకగా శ్వేతపత్రం ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటున్నాయి విపక్షాలు. వాస్తవాలను జనాలకు చెబుతున్నామని ప్రభుత్వం అంటే... హామీలు అమలుచేయలేక తప్పించుకునే ప్రయత్నమంటోంది విపక్షం.
శ్వేతపత్రాలపై తెలంగాణ అసెంబ్లీలో పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పదేళ్లలో తాము సంపాదించిన ప్రగతి ఇదిగో అంటూ బీఆర్‌ఎస్ ఏకంగా డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తే.. మీరు చేసిన అప్పుల నిర్వాకం ఇదేనంటూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. అంతా తప్పుల తడకగా శ్వేతపత్రం ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటున్నాయి విపక్షాలు. వాస్తవాలను జనాలకు చెబుతున్నామని ప్రభుత్వం అంటే… హామీలు అమలుచేయలేక తప్పించుకునే ప్రయత్నమంటోంది విపక్షం.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యుద్ధం మొదలైంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ లెక్కలతో అసెంబ్లీకి వచ్చాయి. 42 పేజీలతో రాష్ట్ర ఆర్థికపరిస్థితపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం దేశంలోనే అట్టడుగున ఉందంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారంతో పాటు, బడ్జెట్, కాగ్, RBI ఇచ్చిన నివేదికల ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేశామంటోంది సర్కార్. బంగారు తెలంగాణ కాదని… అప్పులు తెలంగాణగా ఉందని చెబుతోంది ప్రభుత్వం.
అటు బీఆర్ఎస్ కూడా డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందన్నారు మాజీమంత్రి హరీశ్‌రావు. శ్వేతపత్రం కక్ష సాధింపు లెక్కగా ఉందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక స్థితిపై వైట్ పేపర్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేయలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి.
అప్పులు ఉన్నాయని తెలంగాణ ప్రతిష్ట దిగజారేలా శ్వేతపత్రం ఉందని.. జరిగిన అభివృద్దిపై ఎందుకు చర్చ పెట్టలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్.అయితే తమ ఉద్దేశం అది కాదని ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.
మొత్తానికి వైట్ పేపర్ పై అధికార, విపక్షాల మధ్య వార్ పీక్‌లోకి చేరింది. ఇంతకీ తెలంగాణ గడిచిన పదేళ్లలో అభివృద్ది పథంలో నడించిందా? లేక అప్పుల కుప్పగా మారిందా?
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..