Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: శ్వేత పత్రం ఎవరినో అవమానించడానికి కాదు.. కిషన్ రెడ్డికి అందుకే ఫోన్ చేశా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్వేత పత్రం విడుదల అనంతరం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమంటూ వెల్లడించారు.

CM Revanth Reddy: శ్వేత పత్రం ఎవరినో అవమానించడానికి కాదు.. కిషన్ రెడ్డికి అందుకే ఫోన్ చేశా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2023 | 6:30 PM

పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్వేత పత్రం విడుదల అనంతరం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమంటూ వెల్లడించారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవి.. బీఆరెస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవంటూ తెలిపారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

కొన్ని వాస్తవాలు కఠోరమైనవి.. శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి… అవమానించడానికి కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము ప్రకటించిన గ్యారంటీలను అమలుచేసేవే అని.. ఎగ్గొట్టడానికి కాదన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం.. విడుదల చేశామన్నారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక.. ఎవరికైనా ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండి.. అంటూ వివరించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి తాను ఫోన్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం తాము ఆలోచిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని.. తమ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటామంటూ సీఎం స్పష్టంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..