Telangana: సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ సోదరుడికి ఉద్యోగం.. ప్రభుత్వం ఆదేశాలు

ఈనెల 17న సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana: సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ సోదరుడికి ఉద్యోగం.. ప్రభుత్వం ఆదేశాలు
Damera Rakesh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 24, 2022 | 11:15 PM

Agnipath Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి సందర్భంగా ఆర్పీఎఫ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం డబీర్‌పేటకు దామెర రాకేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 17న రాకేశ్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌.. అతని కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. దీంతోపాటు కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. వరంగల్ కలెక్టర్ బీ గోపిని ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాకేశ్‌ సోదరుడు రామరాజును తగిన ఉద్యోగంలో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కారుణ్య నియామకం కింద విద్యార్హతలకనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన పోస్టులో నియమించాలని సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!