AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 18 కాదు.. ఇక నుంచి 21.. మళ్లీ మారనున్న ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం.. సర్కార్ తాజా ఉత్తర్వులు..

జిల్లాల విభజనతో కేవలం 13 మండలాలకు పరిమితం అయింది. ఆ తర్వాత పాలన సౌలభ్యం భీంపూర్, సిరికొండ, గాదిగూడ, మావల, ఆదిలాబాద్ అర్బన్ లను కొత్త మండాలలుగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 18 కి చేరింది. అయినా జైనథ్ , బేల మండలాల విస్తీర్ణం అత్యదికంగా ఉండటం.. జైనథ్ 55 గ్రామాలతో అతి పెద్ద మండలంగా కొనసాగుతుండటంతో ఈ మండలాన్ని విభజించాలని డిసైడ్ అయింది సర్కార్. భోరజ్ కేంద్రంగా మండల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. మరో వైపు మహారాష్ట్ర సరిహద్దు వరకు...

Telangana: 18 కాదు.. ఇక నుంచి 21.. మళ్లీ మారనున్న ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం.. సర్కార్ తాజా ఉత్తర్వులు..
Adilabad District
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 20, 2023 | 9:33 AM

Share

అడవుల జిల్లా ఆదిలాబాద్.. విస్తీర్ణంలో అతి పెద్ద మండలాలు ఉన్న జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ లో కొనసాగిన‌ సమయంలో అత్యధిక మండలాలతో టాప్‌లో నిలవగా.. జిల్లాల విభజనతో కేవలం 13 మండలాలకు పరిమితం అయింది. ఆ తర్వాత పాలన సౌలభ్యం భీంపూర్, సిరికొండ, గాదిగూడ, మావల, ఆదిలాబాద్ అర్బన్ లను కొత్త మండాలలుగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 18 కి చేరింది. అయినా జైనథ్ , బేల మండలాల విస్తీర్ణం అత్యదికంగా ఉండటం.. జైనథ్ 55 గ్రామాలతో అతి పెద్ద మండలంగా కొనసాగుతుండటంతో ఈ మండలాన్ని విభజించాలని డిసైడ్ అయింది సర్కార్. భోరజ్ కేంద్రంగా మండల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. మరో వైపు మహారాష్ట్ర సరిహద్దు వరకు విస్తరించిన బేల మండలాన్ని సైతం విభజించాలని.. కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మేరకు జైనథ్ లోని కొన్ని గ్రామాలను‌ బేల మండలం లోని మరికొన్ని‌ గ్రామాలను కలిపి‌ సాత్నాల సాగినీటి ప్రాజెక్టునే మండలం పేరుగా మార్చి కొత్త మండల ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో వైపు బోథ్ మండలంలోని సొనాల గ్రామాన్ని మండలంగా మార్చాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు సాగడంతో గత నెల రోజుల క్రితం సొనాలను మండలంగా ప్రకటిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. తాజాగా భోరజ్, సాత్నాలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆదిలాబాద్ 21 మండలాలతో విరాజిల్లనుంది. సాత్నాలను మండలంగా ఏర్పాటు‌ చేయడం కోసం ఏకంగా మూడు మండలాల ముఖ చిత్రాన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైనథ్ మండలంలోని 7 గ్రామాలు, ఆదిలాబాద్ రూరల్ మండలం నుండి 4‌ గ్రామాలను, బేల మండలంలోని 7 గ్రామాలను విడదీసి సాత్నాల పేరుతో కొత్తమండలంగా ఏర్పాటు చేయనుంది సర్కార్. మొత్తం 18 గ్రామాలతో సాత్నాల మండలం ఆవిర్భవించింది.

భోరజ్‌ మండలంలో గూడ, రాంపూర్‌, సిర్సన్న, గిమ్మ, ఆకోలి, కోరట, మాండగడ, కామాయి, పిప్పర్‌వాడ, పూసాయి, తరోడ(బీ), హసీంపూర్‌, బాలాపూర్‌, ఆకూర్ల, సావాపూర్‌, లేఖర్‌వాడ, పెండల్వాడ, సాంగ్వీ మొత్తం 19 గ్రామ పంచాయతీలతో భోరజ్‌ కేంద్రంగా మండలం ఏర్పడుతుండగా.. సాత్నాల మండలంలో సాత్నాల , పార్డి(కే), పార్డి(బీ), మేడిగూడ (సీ), మేడిగూడ (ఆర్‌), సుందరగిరి, మాంగూర్ల, జామిని, మారుగూడతో పాటు బేల మండలంలోని సైద్‌పూర్‌, సాంగ్వీ, డౌనా, పాటాగూడ, ఖారా, దుబ్బగూడ, మసాలా(కే), ఆదిలాబాద్‌ మండలంలోని రామాయి, రాంపూర్‌, శివఘాట్‌, జంబుల్‌ధరి, తిప్ప, పోచంలొద్ది మొత్తం 22 గ్రామ పంచాయతీలతో సాత్నాల మండలం ఏర్పడనుంది.

ఇవి కూడా చదవండి

పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగానే కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎమ్మెల్యే జోగు రామన్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటుచేస్తు ప్రభుత్వం నుంచి జీఓ ఆర్.టి.నెం. 268 పేరిట శనివారం రెవెన్యూ (జిల్లా పరిపాలన) శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..