Telangana Elections: తెలంగాణలో ఇతర రాష్టాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్..
యూపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. తెలంగాణ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ హైకమాండ్‌కు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి సోమవారం నాడు వర్క్ షాప్ కూడా నిర్వహించనుంది బీజేపీ. ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది పార్టీ హైకమాండ్. ఇక నియోజకవర్గాల్లో పర్యటించే ఎమ్మేల్యేలు దృష్టి పెట్టే అంశాలకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది బీజేపీ...

ఇవాళ్టి నుంచి అంటే.. ఆగష్టు 20 ఆదివారం నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే చొప్పున పర్యటించనున్నారు. యూపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. తెలంగాణ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. పార్టీ హైకమాండ్‌కు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి సోమవారం నాడు వర్క్ షాప్ కూడా నిర్వహించనుంది బీజేపీ. ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది పార్టీ హైకమాండ్. ఇక నియోజకవర్గాల్లో పర్యటించే ఎమ్మేల్యేలు దృష్టి పెట్టే అంశాలకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది బీజేపీ.
ఎప్పటికప్పుడు అసెంబ్లీ స్థాయి కొర్ కమిటీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేయడం, వాల్ రైటింగ్ అభియాన్ పై దృష్టి పెట్టడం, స్థానిక నేతలతో పర్యటించే ఎమ్మెల్యే ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడటం చేయాల్సి ఉంటుంది. అలాగే, లోకల్‌గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, స్థానిక ప్రభావం చూపెట్టే ప్రముఖులతో ఇంటరాక్షన్, డిన్నర్ మీటింగ్‌ల ఏర్పాటు, సంఘ్ పరివార క్షేత్రాల కార్యకర్తలతో భేటీ నిర్వహించడంలో ఈ పర్యటనలో భాగం కానుంది. శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంపర్క్ సే సమర్థన్‌లో భాగంగా ప్రముఖులను కలవడం, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్ళడం, ట్రేడర్ కమ్యూనిటీ, అమరుల కుటుంబాలకు, ప్రొఫెషనల్స్‌తో డిన్నర్ సమావేశాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అభవృద్ధి కార్యక్రమాలని సందర్శించడం.. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రజలకు అవగాహన కలిపించే బాధ్యతలను ఈ ఎమ్మె్ల్యేలపై పెట్టింది అధిష్టాం.
నిర్మల్‌లో బీజేపీ నేత దీక్ష..
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్ష ఐదో రోజుకి చేరుకుంది. దీక్షతో ఆయన నిరసంగా కనిపిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మంత్రి ఇంద్రకరణ్ ఇంటిని ముట్టడించాలని భావిస్తున్నారు. అటు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్న రైతులు.. ఇవాళ రాస్తారోకోకి పిలుపునిచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




