Minister KTR: నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
నారాయపేట్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయు వార్డును ప్రారంభించారు మంత్రి కేటీ రామారావు.
Minister KTR Lay of foundation stone for Integrated Handloom traing centre: నారాయపేట్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయు వార్డును ప్రారంభించారు మంత్రి కేటీ రామారావు. ఇందులో పది వెంటలేటర్ బెడ్‌లను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. అందుకు సంబంధించిన కార్యక్రమాలను భవిష్యత్‌లో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
నారాయపేట్‌లో చేనేత కళాకారులందరికీ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రూ. 10 కోట్లతో నిర్మించతలపెట్టిన నైపుణ్య శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. ఈ శిక్షణ కేంద్రం వల్ల చేనేత కార్మికులకు అపారమైన లాభం జరుగుతుందన్నారు. నారాయణపేటలో చేనేత వృత్తికి సంబంధించి గొప్ప కళాకారులు ఉన్నారని, వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసియు వార్డును మంత్రులు @KTRTRS, @VSrinivasGoud ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు @SRReddyTRS, @ChittemRRTRS, @PNReddyTRS తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/f8SyKKr8pE
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 10, 2021
నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల వల్ల కార్మికులు లాభం పొందుతున్నారు. నేతన్న చేయూత కార్యక్రమం ద్వారా గతేడాది రూ. 96 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరోనా సమయంలో ఈ నిధుల వల్ల కార్మికులకు లాభం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలను రాష్ర్ట ప్రభుత్వం నేత కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నేత కార్మికులందరూ వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తల యత్నం
ఇదిలావుంటే, కేటీఆర్ టూర్‌లో ఏబీవీపీ కార్యకర్తల నిరసన కొంత టెన్షన్‌ను క్రియేట్ చేసింది. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సరిగ్గా మంత్రుల వాహనాలు వచ్చే సరికి వాటికి అడ్డంగా వెళ్లి నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తప్పించారు. Read Also…