Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున టెన్షన్ టెన్షన్.. కార్మికులతో చర్చకు సిద్ధమన్న గవర్నర్ తమిళిసై..

రాజ్‌భవన్‌కి ర్యాలీగా బయలుదేరారు. దాంతో రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. 3 వేల మందితో ర్యాలీ తీస్తున్న కార్మికులు.. నెక్లెస్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌కి చేరుకున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికుల నిరసన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. రాజ్‌భవన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌కు ఇరువైపులా భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు రాజ్‌భవన్ ముట్టడి కోసం కార్మికులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే పీవీఆర్ మార్గ్‌కు చేరుకుంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తమ వ్యూహాలను...

Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున టెన్షన్ టెన్షన్.. కార్మికులతో చర్చకు సిద్ధమన్న గవర్నర్ తమిళిసై..
Telangana Raj Bhavan
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2023 | 11:45 AM

హైదరాబాద్, ఆగష్టు 08: టీఎస్ ఆర్టీసీ బిల్లు విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిని నిరసిస్తూ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నెక్లెస్‌ రోడ్‌ సమీపంలోని పీవీ మార్గ్‌కి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కి ర్యాలీగా బయలుదేరారు. దాంతో రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. 3 వేల మందితో ర్యాలీ తీస్తున్న కార్మికులు.. నెక్లెస్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌కి చేరుకున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికుల నిరసన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. రాజ్‌భవన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌కు ఇరువైపులా భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు రాజ్‌భవన్ ముట్టడి కోసం కార్మికులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే పీవీఆర్ మార్గ్‌కు చేరుకుంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు, రోప్ పార్టీలతో పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున టెన్షన్ వాతావరణం నెలకొనడంతో గవర్నర్ స్పందించారు. ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్టీసీ యూనియన్‌ నేతలకు గవర్నర్‌ కబురు పంపారు. సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరుపనున్నారు గవర్నర్ తమిళి సై.

హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వం ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తీరుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 వరకు బంద్‌ పాటించారు కార్మికులు. దాంతో రెండు గంటల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి బస్సులు. జిల్లాల్లో డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలతో గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం లోగా బిల్లు ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.

మరి గవర్నర్ వెర్షన్ ఏంటంటే..

ఆర్టీసీ బిల్లుపై కొన్ని వివరణలు కోరారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. టీఎస్ఆర్టీసీ బిల్లులోని నిబంధనలను పరిశీలించి, నిర్దిష్ట వివరణలు, అస్పష్టతలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాలపై స్పష్టత కోరినట్లు తెలిపారు గవర్నర్. బిల్లుపై క్లారిఫికేషన్ పంపిస్తే వెంటనే బిల్లు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి సూచించారు గవర్నర్ తమిళిసై.

ఈ 5 అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్ తమిళిసై..

1. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.

2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం RTC స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.

3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని ప్రశ్నించిన గవర్నర్.

4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

5. ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్.

గవర్నర్ తమిళిసై ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..