Telangana: రేషన్‌ కార్డుదారులకు పండగలాంటి వార్త… అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ

రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నారు...

Telangana: రేషన్‌ కార్డుదారులకు పండగలాంటి వార్త... అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ
Telangana
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2024 | 8:28 AM

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం కేబినెట్ సబ్‌ కమిటీ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న వారికి సైతం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయనున్నామని మంత్రి పొంగులోటి శ్రీనివాస్‌ తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 49,476 రేషన్‌ కార్డులను మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు.

కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి మరోసారి ఈ నెల 21వ తేదీన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కానుందని, ఈ సమావేశంలో తెల్ల రేషన్‌ కార్డుల మంజూరుకు విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డులతో హెల్త్‌ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్టు మంత్రులు పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త..

ఇదిలా ఉంటే రైతులకు సైతం శుభవార్త తెలిపారు. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్‌ నుంచి సన్న వడ్లు పండించిన రైతులకు ఈ బోనస్‌ అందించనున్నామని సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. అయితే ఎన్నికల ముందు వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి రాగానే సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని చెబుతున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే