Covid 19: పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రేపటి నుంచి..

కంటికి కనిపించని ఓ మాయదారి వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. అగ్ర రాజ్యాలు సైతం ఈ వైరస్‌కు వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీసిన కరోనా వైరస్‌ గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ కేసులు తగ్గాయి...

Covid 19: పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రేపటి నుంచి..
Covid 19 Vaccine
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 18, 2023 | 6:38 PM

కంటికి కనిపించని ఓ మాయదారి వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. అగ్ర రాజ్యాలు సైతం ఈ వైరస్‌కు వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీసిన కరోనా వైరస్‌ గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ కేసులు తగ్గాయి. అయితే తాజాగా పరిస్థితి ఒక్కసారిగా మారింది. మళ్లీ కేసులు పెరగడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగానే 5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్ట‌ర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..