AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మార్చురీల ఆధునికీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏయే పనులు చేపట్టనుందంటే..

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత.

Telangana: మార్చురీల ఆధునికీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏయే పనులు చేపట్టనుందంటే..
Basha Shek
|

Updated on: Feb 02, 2022 | 2:17 PM

Share

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. కాగా రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి (Dead bodies) గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకుని.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టం నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా భౌతిక కాయాన్ని మృతుని ఇంటి వద్దకు చేర్చడం, అనంతరం గౌరవంగా ఖననం చేయడానికి చర్యలు తీసుకుంటోంది.  ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆలోచనలకనుగుణంగా  ఇప్పటికే ప్రతి గ్రామంలో  వైకుంఠ ధామాలను ఏర్పాటుచశారు.  పట్టణాల్లోనూ వీటి ఏర్పాటు వేగంగా సాగుతోంది.  అదేవిధంగా మృతదేహాలను తరలించేందుకు వైకుంఠ రథాలను కూడా ఏర్పాటుచేసింది.

61 ఆస్పత్రుల్లో పనులు..

కాగా ప్రభుత్వం ఇప్పుడు మార్చురీల ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఒకప్పుడు మార్చురీలు కనీస వసతులు లేక దారుణంగా ఉండేవి.  అక్కడి సిబ్బంది ముక్కు మూసుకొని విధులు నిర్వహించాల్సిన దుర్భర పరిస్థితి. మృతుల బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉంటే.. పార్థివ దేహాలను నిల్వ చేసేందుకు కనీస వసతులు కూడా ఉండేవి కావు.   దీంతో కడసారి చూపు దక్కని సందర్భాలెన్నో ఉన్నాయి . ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చురీ లను ఆధునీకరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల మార్చురీలు ఉన్నాయి. వాటిల్లో అవసరమైన పరికరాలు, ఫ్రీజర్లు, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మార్చురీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా నూతన మార్చురీ విధానాన్ని అమలు చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా  10 టీచింగ్ ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు రూ.11.12 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 51 దవాఖానల్లో మర్చూరీల ఆధునికీకరణకు రూ. 21.42 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. హైదారాబాద్ లోని ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ బోధనాసుపత్రులు కూడా  ఇందులో ఉన్నాయి.

ప్రత్యేక పోస్టులు..

కాగా తెలంగాణ  ఏర్పడక ముందు  వైద్య కళాశాలల్లో మాత్రమే ఫోరెన్సిక్‌ నిపుణులు ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మార్చురీ కేంద్రాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులను నియమిస్తున్నారు. వైద్యవిధాన పరిషత్తు దవాఖానల్లో 102 ఫోరెన్సిక్‌ నిపుణుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 63 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 20 డీసీఎస్‌, 19 సీఎస్‌ పోస్టులు ఉన్నాయి. కాగా గతంలో ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే.. ఆ పార్థివ దేహాలను సొంతూళ్ల‌కు తీసుకెళ్లడం పెద్ద సమస్యగా ఉండేది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్‌ వాహనదారులు సాధారణ ఛార్జీల కన్నా  ఐదారు రెట్లు అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. దీంతో ఆయా కుటుంబాలపై ఆర్థికంగా భారం పడేది. ఈ పరిస్థితలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం.. పార్థివ దేహాలను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చింది. ప్రస్తుతం 50 వాహనాలు ఉండగా.. మరో 16 నూతన వాహనాలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: Lavanya Tripathi: పెళ్లి రూమర్లపై స్పందించిన అందాల రాక్షసి.. వాళ్లకెలా తెలుస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Son Of India: మళ్లీ మొదలైన సినిమా జోష్.. మోహన్ బాబు సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

AP- Telangana: విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే.. తేల్చిచెప్పిన కేంద్రం..