Jogulamba: వైభవంగా ప్రారంభమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 6వ తేది అమ్మవారి నిజరూప దర్శనం

Jogulamba Brahmotsavam: తెలంగాణా(Telangana)లో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ(t Alampur Jogulamba) అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు(brahmotsavam) అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 6వ తేది..

Jogulamba: వైభవంగా ప్రారంభమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 6వ తేది అమ్మవారి నిజరూప దర్శనం
Jogulamba Brahmotsavam
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2022 | 2:28 PM

Jogulamba Brahmotsavam: తెలంగాణా(Telangana)లో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ(t Alampur Jogulamba) అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు(brahmotsavam) అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 6వ తేది వసంత పంచమి వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతీ ఏటా జోగుళాంబ అమ్మవారి వార్షిక ఉత్సవాలను వైభవోపేతంగా నిరీవహించడం ఆనవాయితీగా వస్తుంది.  ఈ వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా జోగుళాంబ జాతర పేరిట గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు తమ ఇంటి ను నుంచి తీసుకొచ్చిన కలశాలతో ఊరేగింపుగా పురవీధుల గుండా జోగుళాంబ ఆలయానికి చేరుకుంటారు. ఈ జాతరలో ప్రతీ ఏటా 64 మంది కళాకారులు పాల్గొంటారు.. వీరంతా గ్రామ దేవతలు. పోతురాజు వేష ధారణలతో మంగళవాయిద్యాలు.. మేళతాళాలతో నృత్య ప్రదర్శనలతో ఆలయానికి చేరుకుంటారు. ఈ వేడుకను చూడడానికి వేలాదిగా భక్తులు అలంపురం చేరుకుంటారు.

సహస్త్ర ఘటాభిషేకం: 

అమ్మవారి నిజరూప దర్శనంలో భాగంగా ముందుగా ఆలయంలోని ధ్వజస్థంభం దగ్గర సహస్త్ర ఘటాలను ఏర్పాటు చేసి వాటిలో మంగళద్రవ్యాలతో పాటు అమృతజలాన్ని నింపుతారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ శోడషోపచార పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులు ఈ కలశాలను శిరస్సున ధరించి..

“ఓం శ్రీ మాత్రేనమః.. నమో జోగుళాంబ దేవ్యే నమః”..అని అమ్మవారిని స్మరిస్తూ.. గర్భాలయంలోని అర్చకులకు అందజేస్తారు. ఈ జలాలతో అమ్మావారి విగ్రహానికి అభిషేకిస్తారు.

 అమ్మవారి నిజరూప దర్శనం:

రోజూ అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని స్వర్ణా భరణాల అలంకరణల మధ్య మాత్రమే దర్శించుతాం.. అయితే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంత పంచమి రోజున మాత్రం అమ్మవారి సహజ సిద్ధమైన దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునే  భాగ్యం భక్తులకు కలుగుతుంది. అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్న భక్తులు ఏ విధమైన కోర్కికలు కోరినా తీరతాయని నమ్మకం.

ఆలయ చరిత్ర:

జోగుళాంబ అమ్మవారు ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయంలో నవగ్రహాలు వీరభద్రుడు ఆలయాలకు మధ్యన ఉండే ఓ చిన్న గర్భాలయం కోలువుతీరి ఉండేది. అయితే 2004 ఏప్రెల్ 16 కంచికామకోటి పీఠం వారి సలహా మేరకు అమ్మవారి లో  64 కళలను ఏర్పాటు చేసి.. చిన్న బాలాలయంలో ఏర్పాటు చేశారు. అనంతరం 2005 ఫిబ్రవరి 13 న ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న జోగుళాంబ అమ్మవారిని వసంత పంచమి నాడు నూతన ఆలయంలో పునఃప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారు.

Also Read:

ముచ్చింతల్‌లో మొదలైన ఆధ్యాత్మిక సందడి.. జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి శోభాయాత్రగా..