Road Accident: మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం

|

May 21, 2023 | 10:23 AM

మెదక్ జిల్లా నార్సింగ్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Road Accident: మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
Road Accident
Follow us on

మెదక్ జిల్లా నార్సింగ్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆర్మూర్ మండలం ఏలూరు వాసులుగా గుర్తించారు.పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతానికి చేరుకునే సరికి ఆ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన మాణెమ్మ(60), బాలనర్సయ్య(65) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రామాయపేట ఆసుపత్రికి తరలించారు. ఈ  రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆ విషాదం మరవక ముందే..

కాగా ఇదే  నార్సింగి సమీపంలోనూ  శుక్రవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు విద్యార్థులు ప్రాణాలు వదిలారు. వేసవి సెలవుల ను సరదాగా గడిపేందుకు ఒకే కారులో 10 మందికి పైగా విద్యార్థులు బయల్దేరారు. ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో.. ఆగి ఉన్న లారీ కిందకి ఒక్కసారిగా కారు దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..