BRS Leaders: ఉండేది ఎవరు..? వెళ్ళేది ఎవరు..? జంపింగ్ జపాంగ్‌లపై బీఆర్ఎస్ నజర్
నిన్న మొన్నవరకు భారతీయ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విడిచి ఉండేదీ లేదు అన్నారు.. పార్టీ అంటే ప్రాణం అన్నారు.. టిక్కెట్ ఇస్తే ఏంటి లేకుంటే ఏంటి? గులాబీ జెండా నీడను వీడేది లేదు అన్నారు.. కానీ అలా టికెట్లు అనౌన్స్ అయ్యాయో లేదో.. సీన్ రివర్స్ అయింది. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ వీరు వారు అవుతున్నారు. బీఆర్ఎస్ అసంతృప్తులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు.

కాంగ్రెస్ నుండి వచ్చి బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ అయిన అర్మూర్ నాయకురాలు ఆకుల లలిత.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పార్టీని రాజీనామా చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ మళ్లీ రాకున్నా సరే.. బీఆర్ఎస్‌లోనే ఉంటా అని ప్రకటించి మరీ కాంగ్రెస్ గూటికి చేరారు బాబురావు. అటు పఠాన్‌చెరు నేత నీలం మధు ముదిరాజ్ కూడా రాజీనామా బాటపట్టారు. మానకొండూర్ నేత ఆరెపల్లి మోహన్ కూడా పార్టీ వీడి సొంత గూటికి చేరుకున్నారు. తాజాగా కోదాడ నేత చందర్ రావు వద్దు వద్దు అంటే మల్లయ్య యాదవ్ కు టిక్కెట్ ఇచ్చారంటూ గుర్రుగా ఉన్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సైతం బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. మాదాపూర్, హఫీజ్‌పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కొక్కరుగా గులాబీ జెండా వీడి.. ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు.
మరోవైపు అసంతృప్తితో రగులుతున్న నేతలను క్యాచ్ చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కాచుకు కూర్చుకున్నాయి. అధిష్టానంపై అలక బూనిన నాయకులను కాంగ్రెస్ నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతాం అని చెప్పిన నేతలు.. అంతా వేరే పార్టీల్లోకి క్యూ కట్టంపై బీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే దానిపై లెక్కలు వేస్తూ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారీ ముఖ్యనేతలతో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సర్కార్‌లో సముచిత స్థానం కల్పిస్తామంటూ బుజ్జగింపు పర్వం చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…