Telangana Election Results 2023: అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం కొనసాగింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో పలువురు యువ అభ్యర్థులు సత్తా చాటారు. కాకలుతీరిన రాజకీయ ఉద్దండులను ఓడించి, తొలిసారిగా అసెంబ్లీ హాల్‌లో అధ్యక్ష్యా అనేందుకు సిద్ధమయ్యారు.

Telangana Election Results 2023: అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు
Parnika, Rohit, Yashaswini
Follow us

|

Updated on: Dec 03, 2023 | 6:35 PM

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం కొనసాగింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో పలువురు యువ అభ్యర్థులు సత్తా చాటారు. కాకలుతీరిన రాజకీయ ఉద్దండులను ఓడించి, తొలిసారిగా అసెంబ్లీ హాల్‌లో అధ్యక్ష్యా అనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు రాజకీయాలతో సంబంధం లేని యువతరం తొలి ఎన్నికల్లోనే విజయకేతనం ఎగురవేశారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్‌రావు, పాలకుర్తిలో మామిడాల యశస్వినిరెడ్డి, నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి గెలుపొందారు.

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. కాంగ్రెస్‌ పార్టి నుంచి పోటీ చేసిన 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును ఓడించి సంచలనం సృష్టించారు. 2018లో బీటెక్‌ పూర్తి చేసిన యశస్వినిరెడ్డి.. వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. కొంత కాలం అమెరికా చేసిన యశస్విని రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తొలుత మరో అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే, భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న అభ్యర్థనపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో, ఆమె అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో తన స్థానంలో ఆమె కోడలు యశస్విని రెడ్డికి అవకాశమివ్వాలని కోరడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించి అవకాశమిచ్చింది.

ఇక మెదక్‌ స్థానం నుంచి పోటీ చేసిన 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తనయుడు. సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొనే రోహిత్ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగాలని భావించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు రోహిత్. మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తిచేసి రోహిత్ రావు, రెండు గోల్డ్‌ మెడల్స్‌ సైతం సాధించారు. హైదరాబాద్‌లో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై రోహిత్‌ 9వేలకుపైన మెజారిటీతో విజయం సాధించారు.

మరోవైపు నారాయణపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన మరో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి వయసు 30 ఏళ్లు. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై 7,950 ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు వర్ణికారెడ్డి. భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్‌) చేస్తున్న పర్ణిక, తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో మావోయిస్టుల కాల్పుల్లో నర్సిరెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన నారాయణపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి క్రియాశీలకంగా వ్యవహారించారు. రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగినా, స్వల్ప తేడాతో ఓడిపోయారు శివ కుమార్ రెడ్డి. అయితే ఈసారి ఎన్నికల్లో మహిళా కోటాలో పర్ణికకు దక్కింది. పర్ణిక తల్లి లక్ష్మి (ఐఏఎస్‌) పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ.. పర్ణికకు మేనత్త కావడం విశేషం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :

Latest Articles